మహేష్... అర్జున్.. సర్దుకుపోదాం బ్రదర్

Update: 2018-01-22 04:07 GMT
సంక్రాంతి సీజన్ పూర్తయిపోయింది. ఈ సీజన్ కు రిలీజైన పెద్ద సినిమాల రిజల్ట్ తెలిసిపోయింది. పెద్ద సినిమాలకు అనువైన సీజన్ మళ్లీ సమ్మరే. దీంతో మీడియం అండ్ లో బడ్జెట్ సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కట్టేస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలంతా సమ్మర్ రిలీజ్ కోసం ఇప్పటికే ప్లానింగులు మొదలుపెట్టారు. ఇందులో ఒకే డేట్ కు రెండు సినిమాలు పోటీలో ఉండటం ఆ సినిమా నిర్మాతలనే కాదు.. ఇండస్ట్రీని కూడా కలవరపెడుతోంది.

ఏప్రిల్ 27 నాటికి అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా థియేటర్లకు రానుంది. ఈ డేట్ కు సినిమా తీసుకొస్తామని స్టార్ట్ చేసిన టైంలోనే అనౌన్స్ చేశారు. ఇదే టైంకు మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా సంక్రాంతికే రావాల్సి ఉన్నా పోస్ట్ పోన్ అయి సమ్మర్ కు రిలీజవుతోంది. ఈ రెండు సినిమాల మీద కలిపి దాదాపు రూ. 200 కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఇంత భారీ పెట్టుబడులతో వస్తున్న సినిమాలు పోటీ పడితే అది కచ్చితంగా కలెక్షన్లపై ఎంతయినా ప్రభావం చూపిస్తుంది. దీనిపై రెండు సినిమాల టీంలకు మధ్య సర్దుబాటు చేయడానికి ప్రయత్నాలు ఎవరూ తగ్గలేదు. రకరకాల ప్రయత్నాల తరవాత రాజీ కుదిరిందని తెలుస్తోంది.

ఈ రెండు సినిమాల మధ్య కనీసం రెండు వారాలు గ్యాప్ ఉండేలా చూడాలన్నది లేటెస్ట్ ప్లాన్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను బట్టి ఎవరు ముందు రావాలి.. ఎవరు వెనుక రావాలి అన్నది డిసైడవుతారు. ముందు పూర్తయిన సినిమా ఏప్రిల్ 13న వస్తే.. తరవాత పూర్తయింది 27న థియేటర్లకు వస్తుందన్న మాట. ఇదే టైంలో సూపర్ స్టార్ రజనీ సినిమా 2.0 కూడా రిలీజయ్యే అవకాశముంది. అయితే 2.0 రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. మరి రోబో ఏం డిసైడ్ చేస్తాడో? 
Tags:    

Similar News