'గీత గోవిందం' చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మికల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రంను ఇటీవలే నాలుగు భాషల్లో ఒకేసారి ఒకే టైటిల్ తో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ కాంబోపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రంను భరత్ కమ్మ తెరకెక్కించాడని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక ఈ చిత్రం టీజర్ కోసం రౌడీ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న టీజర్ కు టైం ఫిక్స్ చేశారు.
నిమిషం నిడివితో టీజర్ ను రేపు అంటే మార్చి 17వ తారీకున ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. టీజర్ నిడివి నిమిషమే ఉన్నా మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా ఉంటుందని రష్మీక ట్విట్టర్‌లో పేర్కొంది. నాలుగు భాషల్లో కూడా ఒకేసారి టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించిన నేపథ్యంలో అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, రేపు విడుదల కాబోతున్న టీజర్ తో అన్ని విషయాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.