విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' మే 31 న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఒక్క తెలుగు భాష మాత్రమె కాకుండా అన్నీ సౌత్ భాషలలో రిలీజ్ చేస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను మంచి సమయం చూసుకునే లాక్ చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ మాత్రం తప్పేలా లేదు.
ఈ సినిమా రిలీజ్ అయిన వారంలోపే.. జూన్ 5 న సల్మాన్ ఖాన్ 'భరత్' రిలీజ్ అవుతోంది. విజయ్ సినిమాను సౌత్ మొత్తం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సల్మాన్ సినిమాతో కాస్త ఇబ్బందే. ఇదిలా ఉంటే తాజాగా తమిళ హీరో సూర్య 'NGK' సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. సరిగ్గా 'డియర్ కామ్రేడ్' రిలీజ్ అయ్యే మే 31 వ తేదీన సూర్య సినిమా కూడా రిలీజ్ అవుతోంది. తమిళంతో పాటుగా తెలుగు వెర్షన్ కూడా అదే రోజు విడుదల అయ్యే అవకాశం ఉంది. సూర్య సినిమాలు ఈమధ్య పెద్దగా విజయం సాధించడం లేదు కానీ హిట్ టాక్ వస్తే మాత్రం సూర్య బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతాడు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడుతుందని అనుకోలేం.
మరి 'డియర్ కామ్రేడ్' ను యధావిధిగా అదేరోజు రిలీజ్ చేస్తారా లేక మార్పు చేస్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ మే 31 న రిలీజ్ చేస్తే మాత్రం సూర్య సినిమాతో డైరెక్ట్ గా పోటీ పడాల్సిందే.. సల్లూ భాయ్ తో ఐదురోజుల తర్వాత పోటీకి రెడీ కావాల్సిందే.