టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'డియార్ కామ్రేడ్' ప్రపంచవ్యాప్తంగా జూలై 26 న రిలీజ్ కానుంది. యూఎస్ లో ప్రీమియర్ షోలు ఒకరోజు ముందుగా జులై 25 న గురువారం నాడు ప్రదర్శించబోతున్నారు. విజయ్ గత చిత్రాల ట్రాక్ రికార్డ్.. ప్రస్తుతం విజయ్ క్రేజ్.. సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ ను బట్టి ఈ సినిమాకు యూఎస్ లో మంచి స్పందన దక్కుతోందని సమాచారం.
ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకునే వీలు చిక్కింది. విజయ్ సినిమాల్లో అత్యధిక యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన రికార్డు 'గీత గోవిందం' పేరిట ఉంది. 'గీత గోవిందం' ప్రీమియర్ షోల ద్వారానే $ 400K గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' ప్రీ సేల్స్ ట్రెండ్ చూస్తే మంగళవారం నాటికి 138 లోకేషన్స్ నుండి $150K టికెట్ ప్రీ సేల్స్ గ్రాస్ కలెక్షన్స్ నమోదయ్యాయి.
ఈ సినిమాను అమెరికాలో పంపిణీ చేస్తున్న సరిగమ సినిమాస్ వారు భారీ స్థాయిలో 200 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. పోటీలో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు కాబట్టి ఈ సినిమా ప్రీమియర్ కలెక్షన్స్ 'గీత గోవిందం' ప్రీమియర్ కలెక్షన్స్ మార్క్ ను టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'డియర్ కామ్రేడ్' పై ఉన్న బజ్ ను బట్టి చూస్తే అదేమీ అసాధ్యం కాకపోవచ్చు.