RRR త‌ర్వాత ఆచార్య‌.. తెలివైన నిర్ణ‌య‌మేనా?

Update: 2021-10-14 05:43 GMT
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాల‌న్నీ వ‌చ్చే ఏడాది క్యూ క‌ట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు అగ్ర హీరోల చిత్రాలు స‌హా అన్ని మ‌ల్టీస్టార‌ర్ లు కూడా 2022 లో విడుద‌ల‌య్యేలా ప్లానింగ్ సాగుతోంది. అందులోనూ చాలా సినిమాలు సంక్రాంతి సీజ‌న్ టార్గెట్ గానే బరిలోకి దిగుతున్నాయి. దీనిలో భాగంగా  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టారర్ `ఆర్.ఆర్.ఆర్` ఎట్ట‌కేల‌కు జ‌న‌వ‌రి 7న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది  చివ‌ర్లో రిలీజ్ అవుతుందా? వ‌చ్చే ఏడాది మార్చి? అంటూ కొన్ని తేదీలు లీక్ అయిన‌ప్ప‌టికీ చివ‌రిగా జ‌న‌వ‌రిలోనే ఫిక్స్ అయింది.

అయితే ఇదే స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న `ఆచార్య‌` కూడా సంక్రాంతికే వ‌స్తుందంటూ జోరుగా ప్ర‌చారం సాగింది. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా ఫబ్ర‌వ‌రి 4కి వాయిదా ప‌డింది. అలా మెగా హీరోలిద్ద‌రు న‌టిస్తున్న చిత్రాలు విభిన్న‌మైన‌ తేదీల్ని లాక్ చేసుకున్నాయి. అయితే `ఆర్ ఆర్ ఆర్` ముందుగా రిలీజ్ అవ్వ‌డం అన్న‌ది `ఆచార్య‌`కి అన్ని రకాలుగా క‌లిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. `ఆర్ ఆర్ ఆర్` పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. చ‌ర‌ణ్ కి బాలీవుడ్ లోనూ కొంచెం మార్కెట్ ఉంది. `జంజీర్` రీమేక్ తో అక్క‌డ ఎంట్రీ ఇవ్వ‌డంతో చ‌ర‌ణ్ నోన్ ఫేస్ అనే చెప్పాలి.  భారీ అంచ‌నాల న‌డుమ విడులైన సినిమా ఆశించిన విజ‌యాన్ని అందుకోక‌పోయినా చ‌ర‌ణ్ ని ప‌రిచ‌యం చేయ‌గ‌లిగింది.

ఇప్పుడు జంజీర్ ప‌రాభ‌వానికి స‌రైన స‌మాధానం కూడా చ‌ర‌ణ్ రెడీ చేశాడు. `ఆర్ ఆర్ ఆర్` హిందీలో అత్యంత భారీ రిలీజ్ కి సిద్ద‌మ‌వుతోంది. అటుపై చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషించిన `ఆచార్య` కూడా హిందీలో రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో  `ఆర్ ఆర్ ఆర్` బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే ఆ ఇంపాక్ట్ ఆచార్య‌పై క‌చ్చితంగా ప‌డుతుంది.   హిందీలో  `ఆచార్య` రేంజ్ ని పెంచ‌డానికి ఆర్ ఆర్ ఆర్ ఓ అస్త్రంలా ప‌నిచేస్తుంది. ఆ కార‌ణంగానే జ‌న‌వ‌రిలో రిలీజ్ అవ్వాల్సిన ఆచార్య ఫిబ్ర‌వ‌రికి వాయిదా ప‌డింద‌ని ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌...చిరంజీవి వేర్వేరు సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి గాడ్  ఫాద‌ర్ షూటింగ్ లో బిజీగా ఉండ‌గా...చ‌ర‌ణ్  శంక‌ర్ సినిమా విష‌యంలో త‌ల‌మున‌క‌లై ఉన్నారు.
Tags:    

Similar News