దీపిక ఫాలోవ‌ర్స్‌ రికార్డ్ బ్రేకింగ్

Update: 2018-12-29 15:50 GMT
సెల‌బ్రిటీల ఫాలోయింగ్‌ కి ఇన్ స్టాగ్రమ్ ప్రాతిపదిక‌గా నిలుస్తోంది. ఇక్క‌డ ఫాల‌యింగ్‌ ని బ‌ట్టే స్టార్ డ‌మ్‌ ని కొలిచే స‌న్నివేశం ఉందిప్పుడు. ఆ ర‌కంగా చూస్తే దేశంలోనే నంబ‌ర్ 1 స్టార్‌ గా అవ‌త‌రించింది దీపిక‌. ఇన్‌స్టాలో ఈ అమ్మ‌డిని ఏకంగా 3.3కోట్ల మంది అనుస‌రిస్తుండ‌డం ఓ సంచ‌ల‌నం. బికినీ షూట్, మ్యాగ‌జైన్ షూట్, హాట్ జిమ్మింగ్ వీడియోల‌తో దీపిక ఇంత‌కాలం ఈ రేంజులో అభిమానం పోగేసుకుంది. ఈ ఫాలోవ‌ర్స్ సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది.

అయితే ఇటీవ‌లే దీపిక పెళ్లి అయిపోయింది కాబ‌ట్టి మునుప‌టిలా అంత స్పీడ్ చూపిస్తుందా లేదా అన్న‌ది చూడాలి. మ‌రో వైపు కాంపిటీట‌ర్స్ శ్ర‌ద్ధా క‌పూర్, ఆలియా భ‌ట్  దీపిక‌ను ఇన్ స్టాలో క్రాస్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆలియా భ‌ట్ , శ్ర‌ద్దా ఇద్ద‌రూ 3కోట్ల (30 మిలియ‌న్) క్ల‌బ్‌ లో చేర‌బోతున్నారు. ఇప్ప‌టికే 2.6కోట్ల మంది ఫాలోవ‌ర్స్ తో దీపిక త‌ర్వాతి స్థానంలో నిలిచారు.

ఇలా సామాజిక మాధ్య‌మాల్లో భామ‌లంతా దూసుకుపోతుంటే మేల్‌ డామినేష‌న్ అంత‌కంత‌కు జీరో అయిపోతోంది. కింగ్ ఖాన్ షారూక్‌, ర‌ణ‌వీర్ సింగ్ లాంటి స్టార్ల‌కు కేవ‌లం 1.7కోట్ల లోపు మాత్ర‌మే ఫాలోవ‌ర్స్ ఉన్నారు ఇన్ స్టాలో. వీళ్లు 3కోట్ల మంది ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకునేదెపుడు? అందుకే గాళ్స్ ని కాస్త త‌గ్గించి .. బోయ్స్ కి కూడా ఛాన్సివ్వండి బ్రో!! ఇక ఈ రేస్ లో టాలీవుడ్ స్టార్లు ఎవ‌రూ ఇంకా డ‌బుల్ డిజిట్ నే దాట‌లేదాయె!
    

Tags:    

Similar News