బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ విడి పోయారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా కథనాలు రావడంతో నిజంగానే వీరిద్దరు విడిపోయారా ఏంటీ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇటీవల రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ కారణంగానే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో రణ్వీర్ సిగ్ ఇటీవల తాము ఇద్దరం కలిసే ఉన్నాం అన్నట్లుగా అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టాడు. అయినా కూడా వార్తలు కంటిన్యూ అవుతున్నాయి.
తాజాగా హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం కూడా కలిసి ఉన్నాం.. ప్రేమగా ఉంటున్నాం అన్నట్లుగా అర్థం వచ్చేలా ఆమె సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ను షేర్ చేసింది.
అందులో... వారం రోజులుగా మ్యూజికల్ ఫెస్టివల్ లో పాల్గొని ఇప్పుడే నా భర్త తిరిగి వచ్చాడు. అతడు నా ఫేస్ చూసి చాలా సంతోషించాడు. నేను కూడా అతడిని చాలా రోజుల తర్వాత కలవడంతో ఆనందంగా ఉన్నాను అన్నట్లుగా పోస్ట్ చేసింది.
వీరిద్దరు ఇటీవల ఫిల్మ్ ఫేర్ కోసం ఇచ్చిన ఫోటో షూట్ ను చూసినా కూడా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. అవన్నీ కూడా మీడియా సృష్టి అంటూ తేలిపోయింది.
ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో దీపిక దంపతులు కూడా విడాకులు తీసుకుంటారేమో అని ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు ఊరిపి పీల్చుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.