ఇద్ద‌రూ ఇద్ద‌రే.. క్లీవేజ్ వార్ ప్రకటించారు

Update: 2018-05-12 11:30 GMT
బాలీవుడ్ ముద్దు గుమ్మ‌ల మ‌ధ్య పోటీ ఓ రేంజ్‌లో ఉంటుంది. సినిమా అవ‌కాశాలు అందుకోవ‌డంలో కంటే అందాల‌ను యేథేచ్చ‌గా ప్ర‌ద‌ర్శించ‌డంలో ఒక‌రి మించి ఒక‌రు పోటీప‌డుతుంటార‌క్క‌డ‌. ఇప్పుడు ఈ టైపు పోటీయే దీపికా ప‌దుకొనె- కంగనా ర‌నౌత్ ల మ‌ధ్య జ‌రిగింది. ఈ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు కురిపించిన అందాల జ‌డివాన‌కి వేదిక‌య్యింది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌. వీరు డిక్లేర్ చేసిన క్లీవేజ్ వార్ లో తడసి ముద్దయ్యింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ రెడ్ కార్పెట్ మీద అందాలు ఒలికిస్తూ న‌డ‌వ‌డం బాలీవుడ్ భామ‌ల‌కి భ‌లే కిక్కునిస్తుంది. అందుకే ఆ అద్భుత అవ‌కాశాన్ని అందాల ఆర‌బోత‌తో స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు ఈ ముద్దుగుమ్మ‌లు. దీపికా ప‌దుకునే పింక్ క‌ల‌ర్ డ్రెస్సులో కాళ్ళ అందాల‌తో పాటు క్లీవేజ్ అందాల‌ను క‌నిపించేలా అల‌క‌రించుకుని వ‌చ్చేసింది. ఆ డ్రెస్సులో దీపికాను చూస్తే బాలీవుడ్ హీరోయిన్ అంటే ఎవ్వ‌రూ న‌మ్మరేమో. హాలీవుడ్ రేంజ్ స్టైలిష్ లుక్కులో ఇర‌గ‌దీసింది. అయితే అంద‌రి చూపు ఆమె డ్రెస్సు మీద కంటే... ఆమె చూపించే క్లీవేజ్ అందాల మీదే ఎక్కువ‌గా ఉందిలెండి!

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కంగనా కూడా త‌న ఫ్యాష‌న్ పిచ్చిని చూపించేందుకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ నే ఎంచుకుంది. హాలీవుడ్ పాప్ సింగ‌ర్స్ త‌ర‌హాలో జంప్ సూట్ వేసుకుని వ‌చ్చింది కంగనా. ఎంత ర‌చ్చ చేయాలో అంతా చేసేసింది. పై నుంచి కింది దాకా ఎన్ని అందాలున్నాయో లెక్కేసి మ‌రీ చూసుకొండంటూ తెగించేసి చెప్పిన‌ట్టుగా ఉంది కంగనా. క్లీవేజ్ అందాల‌ను మాత్రం ఎలా ప్ర‌ద‌ర్శించాలో స‌ర‌స పాఠాలు చెప్పేసింది ఈ సెక్సీ బ్యూటీ. ఈ ఇద్ద‌రు చూపించిన అందాల‌ను త‌నివి తీరా ఆస్వాదిస్తూ గ‌డిపేస్తున్నారు గ్లామ‌ర్ ప్రియులు.
Tags:    

Similar News