కొన్నాళ్ల కిందట నా ఇష్టం వచ్చినట్లు బతుకుతా.. ఇష్టం వచ్చిన వాడితో ఎంజాయ్ చేస్తా.. అది నా ఛాయిస్ అంటూ ఓ పెన్సేషనల్ వీడియోతో రచ్చ రచ్చ చేసింది బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకొనే. ఐతే ఇప్పుడామె రణవీర్ సింగ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకోవాలనే ఛాయిస్ తీసుకున్నట్లు బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. మొదట క్రికెటర్లు యువరాజ్‌సింగ్, ధోనీలతో.. ఆపై బాలీవుడ్ అందగాడు రణబీర్ కపూర్.. తర్వాత విజయ్ మాల్యా కొడుకు సిద్దార్థ్ మాల్యాతో వ్యవహారం నడిపిన దీపిక చివరగా రణవీర్ సింగ్ దగ్గర వచ్చి ఆగింది. రామ్ లీలా రోజుల నుంచి వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోంది.
ఐతే ఎప్పుడూ కూడా తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నట్లు ఒప్పుకోలేదీ జంట. ఐతే ఇద్దరికీ వయసు మీద పడిపోతోంది కాబట్టి ఇక వ్యవహారం ఓ కొలిక్కి తెచ్చేస్తే బాగుంటుందని పేరెంట్స్ భావిస్తున్నారట. ముందుగా దీపిక ఫ్యామిలీనే ఎంగేజ్మెంట్ ప్రపోజల్‌తో ముందుకొచ్చిందని.. ప్రేమికులిద్దరితో పాటు రణవీర్ తల్లిదండ్రులు కూడా ఓకే అన్నారని.. దీంతో త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసేద్దామని భావిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ మధ్య దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనే బర్త్‌డేకు కూడా రణవీర్ రావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఐతే రణబీర్, కత్రినాల విషయంలోనూ ఇక పెళ్లే తరువాయి అనుకుంటుండగా.. ఇద్దరూ కలిసి అందరినీ ఫూల్స్‌ని చేస్తున్నారు. మరి దీపిక, రణవీర్ ఏం చేస్తారో?