ఫోటో స్టోరి: వాటే కేక కెమిస్ర్టీ

Update: 2018-03-13 04:20 GMT
లవ్ బర్డ్స్ అంటే ఒక్కో జనరేషన్ లో ఒక్కో రకంగా కనిపిస్తూ ఉంటారు. సెలబ్రిటీ ప్రేమ పక్షుల వ్యవహారం మరో రేంజ్ లో ఉంటుంది. బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న తారలు ప్రేమించుకుంటే.. అది కూడా పబ్లిక్ గా తమ ప్రేమకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇవ్వాలని అనుకుంటే.. అది కచ్చితంగా రణవీర్ సింగ్- దీపికా పదుకొనే మాదిరిగా ఉంటుంది.

ఆన్ స్క్రీన్ పై కంటే ఆఫ్ స్క్రీన్ లో ఎక్కువ కెమిస్ట్రీ పండించేస్తున్నారు డీప్ వీర్. రీసెంట్ గా హలో - హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ 2018 కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ కు అటు అందాల భామ దీపికా పదుకొనే.. ఇటు హ్యాండ్సమ్ హంక్ రణవీర్ సింగ్ హాజరయ్యారు. రావడం వరకూ ఇద్దరూ విడివిడిగానే వచ్చినా.. వచ్చిన తర్వాత ఇద్దరూ పండించిన కెమిస్ట్రీ కేకలు పెట్టించేసింది. లాంగ్ వైట్ గౌన్ లో కనిపించిన దీపిక.. అందాల ఆరబోతతో తెగ రెచ్చగొట్టింది. తన స్టైల్ వెరైటీ డ్రెసింగ్ తో మెరుపులు మెరిపించాడు రణవీర్ సింగ్.

 కానీ వీరిద్దరూ కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చినపుడే అసలు కెమిస్ట్రీ అంతా పండడం ప్రారంభమైంది. ఏకంగా తన ప్రేమికుడి ఒళ్లో కూర్చుని ఫోటో దిగేందుకు కూడా దీపికా సందేహించలేదు. సినిమా కోసమో.. లేకపోతే ఫోటో షూట్ కోసమో ఇలాంటి పోజులు చాలామందే ఇచ్చి ఉంటారు. కానీ ఓ లైవ్ ఈవెంట్ లో రెడ్ కార్పెట్ పై ఇలా కెమిస్ట్రీ పండించిన జంటలు దాదాపుగా కనిపించవు. ఇంత ప్రేమను చాటుతున్నా.. ఆ ప్రేమ కబుర్ల గురించి చెప్పమంటే మాత్రం నోరు మెదపరు డీప్ వీర్.. అదేం విచిత్రమో
Tags:    

Similar News