కేన్స్ లో దీపిక అందాల విందు

Update: 2018-05-12 07:26 GMT
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ల భార‌తీయ తార‌లు దుమ్ము రేపుతున్నారు. ముఖ్యంగా దీపికా ప‌దుకునే మొద‌టి రోజు సాదా సీదాగా క‌నిపించిన‌ప్ప‌టికీ తాజాగా ఆమె వేసిన డ్రెస్ మాత్రం కెమెరా క‌ళ్ల‌ను త‌న వైపే క‌ట్టిప‌డేసింది. ముదురు గులాబీ రంగు ఒరిగామి గౌనులో ఆమె రెడ్ కార్పెట్ పై న‌డిచి వ‌స్తుంటే హాలీవుడ్ ఫోటోగ్రాఫ‌ర్లు పోటీ ప‌డి ఫోటోలు తీశారు. కేన్స్‌లో దీపికా గౌనే ఇప్పుడు హాట్ టాపిక్‌.

అషి స్టూడియోకు చెందిన డిజైన‌ర్లు రూపొందించిన స‌మ్మ‌ర్ గౌనును దీపికా వేసుకుంది. ఆ డ్రెస్సులో ఫెయిరీ టేల్‌లో దేవ‌క‌న్య‌లా కనిపిస్తుంది దీపిక. గౌనుకు జ‌త‌గా చెవుల‌కు డైమండ్ చెవి రింగులు అద‌న‌పు ఆక‌ర్ష‌ణగా నిలిచాయి. దీపికా లోరియ‌ల్ ఉత్ప‌త్తుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో కూడా ఆమె లోరియ‌ల్ త‌ర‌పున ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించింది. ఈ కేన్స్‌లో ఉత్స‌వాల‌లో దీపికా రంగులో ఒక ఆటాడేసింది. మొద‌టి రోజు మెటాలిక్ గోల్డ్ క‌ల‌ర్ గౌనుతో త‌ళుకులీనింది. త‌రువాత వైట్ నెట్ గౌనులో క‌నిపించింది. ఇప్పుడు అంద‌మైన గులాబీ రంగు గౌనులో రెడ్ కార్పెట్ పై న‌డిచింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు దీపిక‌తో పాటూ ప‌లువురు భార‌తీయ తార‌ల‌కు ఆహ్వానం అందింది. కంగ‌నా ర‌నౌత్ మ‌ల్లికా శెరావ‌త్ ఇప్ప‌టికే రెడ్ కార్పెట్ వంద‌నాన్ని అందుకున్నారు. ఐశ్వ‌ర్య‌రాయ్ కూడా త‌న కూతురు ఆరాధ్య‌తో కేన్స్‌లో ల్యాండ‌వ్వ‌బోతోంద‌ని స‌మాచారం. అలాగే సౌతిండియా స్టార్ ధ‌నుష్ కూడా వెళ్ల‌నున్నాడ‌ట‌.


Tags:    

Similar News