ఆఖరి మజిలీ దగ్గర బ్యాగుల మోతలెందుకో

Update: 2018-03-01 05:00 GMT
దశాబ్దాల తరబడి సినీ రంగాన్ని ఏలిన శ్రీదేవి.. ఇప్పుడు ఇల నుంచి దివిగి ఎగిరిపోయింది. ఆమె ఆఖరి మజిలీకి.. ఇప్పటివరకూ ఏ సినిమా హీరోయిన్ కు లభించనంతటి వీడ్కోలు లభించింది. రంగాలు - రాజకీయాలు.. సినిమాలు- ఆటలు.. ఎలాంటి తేడాలు లేకుండా అన్ని వర్గాల నుంచి వచ్చి ఆమెను కడసారి చూసి కన్నీటి వీడ్కోలు పలికారు.

హిందీ సినిమా రంగం తో పాటు.. దక్షిణాది నుంచి కూడా అన్ని భాషల సినిమా జనాలు ముంబైకు చేరుకుని.. శ్రీదేవిని ఆఖరి సారి చూసుకున్నారు. బాలీవుడ్ నుంచి దాదాపు అందరు నటులు అందాల తార ఆఖరి మజిలీకి రాగా.. వీరిలో ఇప్పటి టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఉంది. లేత రంగు దుస్తుల్లో వచ్చిన ఈమె.. తన హావభావాలు కనిపించకుండా కళ్లజోడుతో కవర్ చేసేసుకుంది. ఇలా రావడం ఓకే అయినా.. ఆమె వెంట ఓ అనుచరుడు కూడా ఉన్నాడు. సహజంగా టాప్ స్టార్లు ఎక్కడికి వెళ్లినా వెనుకాల బౌన్సర్లు ఉంటారు. ఆశ్చర్యకరంగా దీపికా పదుకొనే.. ఇక్కడకు కూడా తన అనుచరుడు అయిన ఓ బౌన్సర్ ను తెచ్చుకుంది.

అంతేకాదు.. తన బ్యాగ్ ను కూడా అతడితో మోయిస్తూ బడాయిపోయింది. అంత్యక్రియల దగ్గర దీపిక ఇలాంటి డాంబికాలు పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఉద్దేశ్యపూర్వకంగా చేసిందో లేక.. ఆ సమయంలో అలా జరిగిపోయిందో తెలియదు కానీ.. డిప్స్ చేసిన పనికి మాత్రం జనాల నుంచి విమర్శలు తప్పడం లేదు.
Tags:    

Similar News