ఎంత సినిమా వాళ్లయినా కూడా సరే.. ఒక్కసారి బ్రేకప్ అయిపోయాక మళ్లీ కలిసి పని చేయడం కష్టంగానే ఉంటుంది. ముందులా కెమిస్ట్రీ పండించడం అంత ఈజీ కాదు. కానీ రణబీర్ కపూర్‌కి - దీపికా పదుకొనేల విషయంలో మాత్రం సీన్ రివర్స్. ప్రేమలో ఉన్నప్పటి కంటే కూడా విడిపోయాక తెరమీద మరింతగా రెచ్చిపోతున్నారు వీళ్లిద్దరూ. బ్రేకప్ తర్వాత వచ్చిన ‘యే జవానీ హై దివానీ’లో ఈ జంట ఏ రేంజిలో రొమాన్స్ పండించిందో చూశాం. ఇప్పుడు మళ్లీ ‘తమాషా’ సినిమాలోనూ అదే స్థాయిలో కెమిస్ట్రీ పండిందని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతోంది. అంటే ఇద్దరికీ మాజీ ప్రేమికులం అనే ఫీలింగ్ ఏమాత్రం లేదని దీన్ని బట్టి తెలిసిపోతోంది.
మాజీ ప్రేమికులనే ఫీలింగ్ లేకపోతే లేకపోయె.. కానీ రణబీర్ తో తెరమీద ఆ రేంజిలో రొమాన్స్ పండించి.. అతణ్ని ఏకంగా అన్నయ్యా అని సంబోధించడం దీపికకే చెల్లింది. తమాషా ట్రైలర్ విడుదల సందర్భంగా.. ఓ ఆసక్తికర చర్చ జరిగింది. వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో 90 రోజుల దాకా ఏ మెసేజ్ డెలీట్ చేయకూడదన్న నిబంధనల గురించి రణబీర్ మాట్లాడుతూ.. ‘‘మీకు బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో ఉంటే అభ్యంతరకరంగా ఉండే మెసేజ్ లు పంపుకోవద్దు. బుక్కయిపోతారు’’ అనగా.. వెంటనే దీపిక అందుకుని.. ‘‘శభాష్.. బ్రో’’ అనేసింది. అయినా మాజీ ప్రియుణ్ని బ్రో (బ్రదర్) అనడం దీపిక మాత్రమే చేయగలదేమో. రణబీర్ కూడా దీపికతో అదే స్థాయిలో పరాచికాలాడాడు. తనకు వరుసగా ఫ్లాపులు ఎదురవుతుండటం గురించి స్పందిస్తూ.. ‘‘దీపిక లక్కీ గర్ల్ అంటుంటారు. ఆ లక్ కొంచెం నాకు ప్రసాదిస్తుందేమో అని ఆశిస్తున్నా’’ అన్నాడు. మొత్తానికి మాజీ లవర్స్ టిపికల్ రొమాన్స్ తో ‘తమాషా’ ట్రైలర్ లాంచ్ భలే ఫన్నీగా సాగిపోయింది.