ప్రతి మనిషినీ నువ్వు ఎప్పుడు హాపీ గా ఉన్నావు అని అడిగితే 90 శాతం మంది చెప్పే సమాధానం ఒకటే స్కూల్ డేస్ అని. నిజమే ఆ వయసులో హాపీ అనే పదానికి అర్ధం కూడా వెతుక్కునే అవసరం ఉండదు. మనం చిన్నప్పుడు చదువుకునే బల్ల, ఆటలాడుకునే వీధి, పెరిగిన ఇల్లు అన్నీ మనకు మంచి తీపి గుర్తులుగా జీవితాంతం మిగిలిఉంటాయి. ఒక స్టార్ హీరోయిన్ కు అయినా అంతేగా.
స్టార్ బ్యూటి దీపికా పడుకొనే ఈ మధ్యనే తన బాల్యంకు సంబంధించి ఫోటో ఒకటి షేర్ చేసింది. అప్పట్లో చిన్నప్పుడే ప్రకాష్ పదుకొనె కూతుళ్లు గా ఒక మ్యాగజైన్ కు ఇంటర్యూ ఇచ్చిందిలే. ఆ ఫోటో వివరాలు ఏంటంటే.. “ఒకే గదిలో ఇద్దరు అక్కచెల్లలు. ముచ్చటగొలిపే కొన్ని ముచ్చటలు ఉన్నాయి. 12 ఏళ్ల దీపికా - 7 ఏళ్ల అనిషా ఒక సోఫే పై ఇలా కూర్చొని ఉన్నారు వాళ్ళ వెనకాలే గోడ పై అప్పటి టైటానిక్ పోస్టర్ అతికించి ఉంది. ఆ పక్కనే హీరో లియోనార్డో డికాప్రిఓ ఫోటో కూడా ఉంది. వాళ్ళ బెంగళూరు లో ఉన్న పెద్ద ఇంటిలో వీళ్ళు ఒకే గదిలో ఉంచడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అక్క చెల్లి మధ్య బంధం బలపడటానికి” అంటూ దీపిక మథర్ ఉజాల చెప్పారు. చాలామంది పిల్లలు లాగా దీపికా ఆటలాడుకోవడం కన్నా బ్యాడ్మింటన్ సాధనలో ఎక్కువ కాలం గడిపేదట.
ఇంకా ఈ గది గురించి దీపికా ఏమందంటే.. “నేను అనిషా ఇక్కడే కలిసి గడిపేవాళ్ళం. నాకు ఆ సోఫా అంటే చాలా ఇష్టం. అక్కడే చదువుకునే దాన్ని. నా ఫ్రెండ్స్ వచ్చినా అక్కడే కబుర్లు చెప్పుకునే వాళ్ళం. అనిషా కు కంప్యూటర్ అంటే పిచ్చి. నేను కూడా కంప్యూటర్ కార్ గేమ్స్ అవి బాగా ఆడేదాన్నిలే. నా ఫ్రెండ్స్ గౌతమ్ - కబీర్ మా ఇంటికి వచ్చినప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళం. మాది అప్పటిలో అదో కంప్యూటర్ స్నేహం లెండి” అంటూ తెగ మురిసిపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/