ముంబైలోని లగ్జరియస్ అపార్ట్ మెంట్స్ లో ఒకదానిలో దీపికా పదుకొనే నివాసం ఉంటుంది. ఈ అపార్ట్ మెంట్ టవర్స్ లో దీపికా ఈ ఫ్లాట్ కొనడం 2010లో హాట్ టాపిక్. 16 కోట్ల రూపాయలు చెల్లించేసి 26వ అంతస్తులో.. ఫ్లాట్ కొనుగోలు చేసింది దీపిక.
ఇప్పుడు అదే టవర్ లోని 30వ అంతస్తులో ఉన్న మరో ఫ్లాట్ ను కూడా కొనేసింది దీపికా. అయితే.. రణవీర్ సింగ్ తో పీకల్లోతు లవ్ లో ఉన్న ఈ బ్యూటీ.. తన లవర్ కోసం కొనుగోలు చేసిందని అనుకోవడం కామన్. కానీ ఈ ఫ్లాట్ ను తండ్రి కోసం తీసుకుందిట. దీపిక ఫాదర్ ప్రకాష్ పదుకొనే ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ముంబైలో కూతురు నివాసం ఉంటున్న టవర్స్ లో ఫెసిలిటీస్ చూసి ఈయన షాక్ తినేశారట. వాకింగ్ ట్రాక్స్.. స్విమ్మింగ్ పూల్స్ తో పాటు బ్యాడ్మింటన్- స్క్వాష్ ఆడేందుకు సెపరేట్ గా కోర్టులు ఉండడం ఈయనకు బాగా నచ్చేసినట్లు తెలుస్తోంది.
తండ్రి వయసును ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. తనకు దగ్గరగా ఉండడం.. అందులోనూ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న పరిస్థితుల్లో నివాసం ముఖ్యం అని భావించిన దీపికా పదుకొనే.. 40 కోట్లు కట్టేసి.. ఫ్యామిలీని దగ్గరగా తెచ్చేసుకుంటోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/