భారీతనం నిండిన విజువల్ గ్రాఫిక్స్ .. భారీ ఎఫెక్ట్స్ .. సోషియో ఫాంటసీ కథాంశంతో `బ్రహ్మాస్త్ర` ట్రైలర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ కి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ సినిమాని ట్రయాలజీ తరహాలో రూపొందిస్తూ దర్శకుడు అయాన్ ముఖర్జీ చాలా హోప్స్ పెట్టుకోగా.. అతడి బృందం థియేటర్లలో ఘనవిజయం కోసం ఎంతో ఆశగా వేచి చూస్తున్నారు. ముఖ్యంగా రణబీర్ - ఆలియా జంట ఈ సినిమాని ఎంతో సెంటిమెంటుగా ప్రమోట్ చేస్తోంది.
అయితే ఇంతలోనే ఒక ట్విస్టు రివీలైంది. బ్రహ్మాస్త్ర ట్రైలర్ ఇంతకుముందు రిలీజ్ కాగా అందులో ఆలియాతో ప్రేమాయణం సాగించే శివ పాత్రలో రణబీర్ కనిపించాడు. కానీ ఇందులో అతడి మాజీ రియల్ లవర్ దీపిక పదుకొనే కూడా క్షణకాలం మెరిసే అతిథి పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది.
దీనికి కారణం లేకపోలేదు. ట్రైలర్ లో పరిశీలనగా చూస్తే.. ఎగసిపడే కెరటాల ముందు నడుచుకుంటూ వస్తున్న జల దేవత కనిపిస్తోంది. ఆ ఫోటోని అభిమానులు సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. ఆ విజువల్ అంత స్పష్టంగా లేదు. ఫోటో క్లారిటీతో లేదు. కానీ ఆమె దీపికనే అంటూ సిద్ధాంతాన్ని చెబుతున్నారు. ఇది నిజమా.. నిజంగానే నిజమా? అంటూ రణబీర్ అభిమానులు కాస్త సీరియస్ గా ఈ పోస్టర్ ని పదే పదే పరిశీలనగా చూస్తున్నారు. ఆసక్తికరంగా రణబీర్ ప్రస్తుత ప్రేయసి కం భార్యామణి ఆలియా ఈ మూవీలో ప్రేమికురాలిగా నటించగా.. అతిథి పాత్రలో దీపిక కనిపించడం రక్తి కట్టిస్తుందని కూడా ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు.
ట్రైలర్ లో ఆ ఎర్ర చీర దేవత దీపికనే అంటూ అభిమానులు బాగానే కనిపెట్టారు. ఆమె అలియా భట్ లేదా మౌని రాయ్ కానే కాదు. బాగా పరిశీలిస్తే ఆమెనే దీపిక. జల దేవత జై దేవిగా కనిపించబోయేది తనే అంటూ సిద్ధాంతాన్ని చెబుతున్నారు. నిజానికి దర్శకుడితో దీపిక పదుకొనేకు చాలా చక్కని స్నేహం ఉంది. అయాన్ ముఖర్జీతో కలిసి యే జవానీ జై దీవానీ చిత్రానికి పని చేసింది. అందుకే బ్రహ్మాస్త్రలో దీపిక అతిథి పాత్రలో కానీ ఏదైనా ముఖ్యమైన పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. కానీ జై దేవిగా తనే నటిస్తుదని మాత్రం అభిమానులకు క్లూ లేదు. ఇప్పటికి ఇది ఊహాగానం మాత్రమే.
కొందరైతే బ్రహ్మాస్త్ర పార్ట్ 2లో దీపిక కనిపిస్తుందని పార్ట్ 1లో తనకు పాత్ర ఏదీ లేదని కూడా చెబుతున్నారు. మరికొందరు షారూఖ్ ఖాన్ పార్ట్ 3లో విలన్ గా కనిపిస్తారని కూడా చెబుతున్నారు. అయితే ఆ ఇద్దరూ మొదటి భాగంలోనే అతిధి పాత్రలో కనిపిస్తారని కూడా టాక్ ఉంది. అయితే ఈ థియరీలన్నీ నిజాలేనంటూ చిత్రబృందం క్లారిటీనివ్వాల్సి ఉంటుంది.