తెలుగు తేజం పాత్రలో దీపికా పదుకునే

Update: 2018-01-31 11:01 GMT
పద్మావత్ తో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న దీపికా పదుకునే తెలుగు సినిమాల్లోకి వచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు జీవిత కథ ఆధారంగా నటుడు సోను సూద్ నిర్మించే సినిమాలో దీపికాను నటింపజేసేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్. స్వతహాగా దీపిక మంచి ప్లేయర్. నాన్న ప్రకాష్ పదుకునే అంతర్జాతీయ స్థాయిలో పేరున్న క్రీడాకారుడు. సో బ్లడ్ లోనే ఆట ఉంది కాబట్టి పివి సింధు బయోపిక్ కు తనైతేనే న్యాయం చేయగలదని సోను సూద్ భావిస్తున్నాడట. మరో పక్క ఇతర నిర్మాతలు నైనా నెహ్వాల్ స్టొరీని సాహో హీరొయిన్ శ్రద్ధా దాస్ తో తీయాలని స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసి ఉంచుకున్నారు. కాని అది ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉంది.శ్రద్ధా దాస్ బదులు దీపికా పదుకునేతోనే అది చేయించే దిశగా చర్చలు జరిగాయి అని టాక్ వచ్చింది కాని ఆ తర్వాత ఎటువంటి అప్ డేట్స్ లేవు.

ఒకవేళ దీపికా ఒప్పుకుంటే మాత్రం తెలుగు తేజం కథ ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుంటుంది. ఇప్పుడు బాలీవుడ్ లో బయోపిక్ ల సీజన్ బాగా నడుస్తోంది. మిల్కా సింగ్ - సచిన్ టెండూల్కర్ - ధోని - మేరి కొమ్ సూపర్ హిట్స్ కాగా అజహర్ కూడా ఓ మోస్తరు ఫలితం దక్కించుకుంది. ఈ నేపద్యంలో స్పోర్ట్స్ స్టార్ మూవీస్ కి మంచి డిమాండ్ ఉన్న నేపధ్యంలో పివి సింధుది కూడా వస్తే బాగానే వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి నైనాది వస్తుందో లేక సింధుది సెట్స్ పైకి వెళ్తుందో ప్రస్తుతానికి సస్పెన్స్. సోను సూద్ ఈ పాటికే దీపికతో ఓ రౌండ్ చర్చలు జరిపినట్టు టాక్. కార్యరూపం దాలిస్తే మంచిదే. ఓకే అయితే హింది - తెలుగు ద్విబాషా చిత్రంగా ఇది తీసే ప్లాన్ లో ఉన్నాడు సోను సూద్. క్రికెట్ స్టార్ మిథాలి రాజ్ సినిమా గురించి టాక్ నడుస్తోంది కాని ఆ పాత్ర పోషించగలిగే హీరొయిన్ లేక ప్రస్తుతం హోల్డ్ లో ఉంది. చూస్తుంటే తెలుగు తేజాల కథలు బాలీవుడ్ తెరను కూడా అలకరించబోతున్నాయి.
Tags:    

Similar News