ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ కోసం అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునేతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ను జులై నుండి పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఎత్తున సెట్టింగ్ లు వేయిస్తున్నారట.
సినిమాలో మెజార్టీ భాగం ఆ సెట్స్ లో ఉంటుందని అంటున్నారు. సినిమాలో హీరోయిన్ పాత్ర ప్రాముఖ్యత నేపథ్యంలో దీపిక పదుకునే నుండి పెద్ద ఎత్తున డేట్లు అవసరం అవుతాయని అంటున్నారు. బాలీవుడ్ లో దీపిక పదుకునే ప్రస్తుతం నెం.1 హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి నెం.1 హీరోయిన్ ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్ మరియు షారుఖ్ ఖాన్ ల సినిమాల్లో నటిస్తుంది. ఆ రెండు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించేందుకు కమిట్మెంట్ ఇచ్చింది.
ఇంతటి బిజీ హీరోయిన్ ప్రభాస్ మూవీ కోసం బల్క్ డేట్లు ఇవ్వడం అంటే సాధ్యమేనా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత దీపిక పదుకునే డేట్ల కోసం చిత్ర యూనిట్ సభ్యుల పాట్లు తప్పవని అంటున్నారు. ఇంత భారీ సినిమా అంటే ఒకటి రెండు షెడ్యూల్స్ అటు ఇటు అవ్వడం కామన్.. అప్పుడు దీపిక డేట్లు మళ్లీ మళ్లీ మార్చాల్సి రావచ్చు. కనుక ఆమె నుండి డేట్లు అనుకున్న సమయంకు లభించేనో లేదో అంటున్నారు. ఆ కారణంగానే ప్రభాస్ మూవీకి దీపిక వల్ల చిక్కులు తప్పవేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.