దీపావళి అనగానే టపాసులు, వ్రతాలు, ఈ కోలాహలం అంతా ఇంతా కాదు.. ఆ సందడి మామూలుగా ఉండదు. చిన్న కుటుంబాల్లో ఎంతో సందడి ఉంటుంది. ఇక సెలబ్రెటీల జీవితాల్లో జరిగిన విషయాలను చెబుతుంటే మరింత ఆసక్తి రేపుతుంది. తాజాగా తన చిన్ననాటి దీపావళి సంబరాలను బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకొనే పంచుకున్నారు.
దీపికా పదుకొనే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకుడు. పలు ఇతర సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.బాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా ఎదిగిన దీపిక పడుకొనే బాల్యం అంతా కర్ణాటకలోని బెంగళూరులోనే గడిచింది. తన చిన్నతనంలో దీపావళి సందడి అంతా ఇంతా కాదని తాజాగా గుర్తు చేసుకుంది.
బిల్డింగ్ లో ఉన్న మిగిలిన పిల్లలు అందరితో కలిసి కిందికి దిగి టపాసులు కాల్చేవారట దీపిక. ఆ రోజు స్వీట్లతో పండుగ సంబంరం అంబరాన్ని తాకేదట.. ఎవరు దీపావళి గురించి కదలించినా బెంగళూరులో చేసుకున్న ఆ సంబరాలనే దీపిక వల్లె వేస్తుందట..
ఇక దీపిక పేరు కూడా దీపావళితోనే పెట్టారని తన కుటుంబంలోని అందరి పేర్లు కూడా దీపావళితోనే పెట్టారని ఒక కొత్త విషయాన్ని దీపిక పడుకొనే చెప్పుకొచ్చింది. దీపిక తల్లి పేరు ‘ఉజ్వల’, తండ్రి ప్రకాష్, సోదరి అనిశ.. ఇలా అందరి పేర్లకూ వెలుగుల దీపావళికి కనెక్షన్ ఉందని చెబుతోంది. తమ మధ్య సరదాగా ఈ సంభాషణ కూడా జరిగిందని వివరించింది.
ప్రతీ దీపావళికి వేడుకలను గ్రాండ్ గా చేసే దీపిక పడుకొనే గత ఏడాది మాత్రం సన్నిహితుల మధ్య జరుపుకుంది. కరోనా కారణంగా కొద్దిమందితోనే చేసుకుంది. ఈసారి గ్రాండ్ గా ముంబైలోనే ప్లాన్ చేసుకుంది.
ప్రస్తుతం దీపిక తన భర్త,హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి నటించిన 83వ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక హృతిక్ రోషన్ తో ‘ఫైటర్’, షకున్ బాత్రా సినిమా షూటింగ్ కూడా పెండింగ్ లో ఉంది. ప్రభాస్ మూవీలోనే నటిస్తోంది.