సినిమాల్లో అతని ముద్దులే బెస్ట్ -దీపిక

Update: 2018-01-24 23:30 GMT
అనేక వివాదాల అనంతరం పద్మావత్ మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ కూడా పూర్తయింది. ఈ కార్యక్రమానికి రణవీర్ సింగ్ తో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని మరీ అటెండ్ అయింది పద్మావతి పాత్రధారిణి దీపికా పదుకొనే. వీరిద్దరి మధ్య బోలెడంత అనుబంధం ఉందనే సంగతి.. ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో మరోసారి అందరికీ తెలిసివచ్చింది.

సాంప్రదాయ వస్తధారణతో పద్మావత్ ప్రీమియర్ కు వచ్చిన వీరిద్దరూ కలిసిమెలిసి ఆంతరంగికంగా మాట్లాడుకున్నారు. రణవీర్ - దీపికలు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన తీరు మొత్తం ఈ ఎఫిసోడ్ లకే హైలైట్ గా నిలిచింది. అయితే.. ఇదే సమయంలో ఓ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. దీపికా పదుకొనే మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి. 'బిజినెస్ (సినిమా)ల వరకు అయితే రణవీర్ సింగ్ బెస్ట్ కిస్సర్' అంటూ నేహా ధూపియాకు చెప్పింది దీపికా పదుగొనే. బీఎఫ్ ఎఫ్ కార్యక్రమంలో భాగంగా ఈ కామెంట్స్ చేసింది డిప్స్. ఇప్పటికి అయితే రణవీర్ తో దీపిక ప్రేమాయణం కబుర్లు నిజమే అయినా.. నిశ్చితార్ధం అయిపోయిందనే మాట మాత్రం అవాస్తవం.

ఇదే విషయాన్ని తన ఉంగరం వేలు చూపించి మరీ చెప్పుకొచ్చింది దీపికా పదుకొనే. పద్మావత్ ప్రీమియర్ కు తన సోదరి అనీషా పదుకొనే కలిసి హాజరైంది దీపికా. ఈ చిన్నది కూడా ఇదే మాటను వల్లె వేసింది.
Tags:    

Similar News