ఆ మంత్రి పదవి కోరుకుంటున్న హాట్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె ఇటీవలే ప్రియుడు రణ్ వీర్ సింగ్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. గత ఏడాది పద్మావత్ వంటి బ్లాక్ బస్టర్ మూవీని చేసిన దీపిక పదుకొణె ప్రస్తుతం కూడా చాలా సినిమాలకు కమిట్ అయ్యింది. అయితే పెళ్లి కారణంగా కొన్ని నెలల గ్యాప్ తీసుకుంటున్న ఈ అమ్మడు త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకు వెళ్లబోతుంది. ఇక తాజాగా ఈమెను మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తో సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన దీపిక పదుకునే ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
దీపిక మాట్లాడుతూ.. నేను ముంబయిలో నివసిస్తున్నందుకు గర్విస్తున్నాను. ముంబయి నాకు చాలా ఇచ్చింది. నా జీవితం ముంబయితో ముడిపడినందుకు ఆనందంగా ఉంది. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ.. నాకు రాజకీయాల గురించి పెద్దగా అవగాహణ అయితే లేదు. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన కూడా లేదు. అయితే ఒక వేళ నాకు కనుక అవకాశం వస్తే మాత్రం తప్పకుండా స్వచ్చభారత్ మంత్రిని అవుతాను.
నాకు స్వచ్చత అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి కూడా నేను నా పరిసరాలను నీట్ గా ఉంచుకునేందుకు ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని. అందుకే మా బంధువులు వారి వారి ఇళ్లలో నన్ను ఉంచుకునేందుకు ఆసక్తి చూపించే వారు. కొన్నాళ్ల తర్వాత అర్థం అయిన విషయం ఏంటీ అంటే వారి ఇళ్లలో నేను ఉంటే వారి బెడ్ రూం, వాల్ సెల్ప్ ఇలా అన్నింటిని నీట్ గా ఉంచేస్తానని.
త్వరలో దీపిక 'ఛాపక్' చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతుంది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఛాపక్ చిత్రంలో డీ గ్లామర్ లుక్ లో దీపిక కనిపించబోతుంది. మరో వైపు ఈమె భర్త రణ్ వీర్ సింగ్ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. తాజాగా సింబా మరియు గల్లీ బాయ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను దక్కించుకున్నాడు.