ఫ్యాషన్ ప్రపంచంలో వింత వింతలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది కేన్స్. ఈ ఏడాది కేన్స్ ఉత్సవాలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో ప్రపంచ అందగత్తెలతో పోటీపడుతూ మన బాలీవుడ్ భామలు కంటికి కునుకు కరువయ్యే ట్రీటిస్తున్నారు. అటు తమతో పోటీపడేవాళ్లకు.. ఇటు తమని అనుసరించే అభిమానులకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డిజైనర్ డ్రెస్సుల సెలక్షన్ నుంచి మేకప్ హెయిర్ డిజైన్ వరకూ ప్రతిదాంట్లో మన భామల శ్రద్ధ ఆశ్చర్యపరుస్తోంది. ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం కాన్సెప్టు లేకుండా ఎవరూ బరిలోకి వచ్చిందే లేదు. హీనాఖాన్.. కంగన.. దీపిక.. ప్రియాంక చోప్రా రెడ్ కార్పెట్ ని ఒణికించారంటే అతిశయోక్తి కాదు. తమవైన అందచందాలతో మైమరిపించారు.
ఒక్కో భామ ఇప్పటికే మూడు నాలుగు రకాల డిజైనర్ స్టైల్స్ లో కనిపించి యూత్ కి కన్నుల పండుగను తెచ్చారు. ఇప్పటికే డే 1 గడిచి డే2లో ఎంటరయ్యారు. నేడు దీపిక పదుకొనే కొత్త లుక్ లో తాట తీసింది. ఈసారి దీపిక ఓ భారీ కాస్ట్యూమ్ లో ఒదిగిపోయి కనిపించింది. నాచురంగు స్పాంజ్ లాంటి ఓ డిజైనర్ డ్రెస్ లో నవ్వులు చిందిస్తూ మైమరిపించింది. ఆ తలకట్టును ఓ గులాబీలా తీర్చిదిద్దడం ఆసక్తి రేకెత్తించింది.
ఈ డిజైనర్ లుక్ కి జనాల నుంచి స్పందన ఎలా ఉంది? అంటే మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ కొత్త లుక్ పై నెటిజనం నుంచి ట్రోల్స్ ఆ రేంజులో ఉన్నాయి. బాత్ స్పాంజ్ లో ఇరుక్కున్న అందాల దీపిక అంటూ పలువురు కామెంట్లను పోస్ట్ చేశారు. పోక్ మోన్.. బల్బ్ సార్ అంటూ కామెంట్లు రువ్వారు. కొందరైతే క్యాబేజీ పువ్వులా ఉంది అంటూ కవితాత్మకంగానూ వర్ణించారు. దీపిక ఈ ఈవెంట్ లో ఓవరాల్ గా ఐదు ఔట్ ఫిట్లలో దర్శనమివ్వనుంది. మునుపటి లుక్ కి అద్భుతం అంటూ స్పందనలు వచ్చాయి. కేన్స్ వేదికగా అంతర్జాతీయ బ్రాండ్ ప్రఖ్యాత లోరియల్ కి దీపిక ప్రమోషన్ చేస్తున్న సంగతి తెలిసిందే.