హృతిక్ మాటెత్తితే కంగన ఏడ్చేసింది

Update: 2017-09-01 04:22 GMT
కంగనా రనౌత్.. హృతిక్ రోషన్ గొడవ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ ప్రేమించుకోవడం.. ఓ దశలో ఒకరికొకరు బాగా దగ్గరవడం.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో దూరం కావడం.. ఆపై ఇద్దరూ బద్ధ శత్రువుల్లా మారి కొట్లాడుకోవడం.. ఒకరి మీద ఒకరు పోలీస్ కేసులు పెట్టుకునే వరకు విభేదాలు ముదరడం.. ఇలా చాలా చాలా పరిణామాలే జరిగాయి. ఐతే కొన్ని నెలల కిందట ఇద్దరూ రాజీకి వచ్చి ఈ వివాదానికి తెరదించారు. ఐతే కంగన మళ్లీ ఈ వ్యవహారాన్ని కదిలించింది. ఓ హిందీ ఛానెల్లో ప్రసారమయ్యే షోలో ఆమె హృతిక్ తో గొడవ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది.

హృతిక్ పేరెత్తకుండానే అతడు చేసిన పని దారుణమని వ్యాఖ్యానించిన కంగన.. ఎమోషన్ తో ఏడ్చేసింది. ఆ వ్యక్తిని తాను ఎంతో ప్రేమించానని.. అతడి గురించి తాను కవితలు కూడా రాశానని.. కానీ ఆ వ్యక్తి నమ్మక ద్రోహానికి పాల్పడుతూ.. తన మెయిల్స్ అన్నింటినీ బహిర్గతం చేసి తనను తీవ్ర మనో వేదనకు గురి చేశాడని కంగనా అంది. అది తనకు జీవితంలో రెండో చావు లాంటిదని కంగనా వ్యాఖ్యానించింది. అతను తనకు ద్రోహం చేశాడని ఆమె అంది. ఈ షో పూర్తి ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుండగా.. కంగనా ఎమోషనల్ అయిన వీడియోతో ప్రోమో వదిలారు. మరి ఆ షో పూర్తి ఎపిసోడ్లో హృతిక్ గురించి కంగనా ఇంకా ఏమేం అందో.. దీనిపై హృతిక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Tags:    

Similar News