ఫస్ట్‌ లుక్ : బండ్ల 'డేగల బాబ్జీ' అదుర్స్‌

Update: 2021-09-17 17:30 GMT
తమిళ చిత్రం ఒత్తు సెరుప్పు సైజ్ 7 ను తెలుగులో బండ్ల గణేష్‌ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చింది. షూటింగ్‌ ప్రారంభం అయిన రోజే బండ్ల గణేష్‌ లుక్ ను రివీల్‌ చేయడం జరిగింది. తాజాగా సినిమా టైటిల్‌ ను రివీల్ చేస్తూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. సినిమాకు డేగల బాబ్జీ అనే టైటిల్‌ ను ఖరారు చేయడం జరిగింది. టైటిల్ తో పాటు బండ్లగణేష్‌ కంటిపై బ్లేడ్ తో గాటు.. గాటు నుండి రక్తం రావడం వంటివి చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. బండ్ల గణేష్‌ మొదటి సినిమాతోనే ఒక మంచి నటుడిగా హీరోగా గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా ఫస్ట్‌ లుక్ చూస్తుంటే అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్‌ కు వీరాభిమాని అవ్వడంతో పాటు.. పవన్ తో సినిమాలు నిర్మించడంతో పాటు చరణ్‌.. ఎన్టీఆర్.. బన్నీ వంటి స్టార్స్‌ కూడా సినిమాలను నిర్మించిన కారణంగా బండ్ల గణేష్‌ సినిమా అంటే జనాల్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే చాలా మంది పాజిటివ్ గా రియాక్ట్‌ అవుతున్నారు. ఖచ్చితంగా ఒక మంచి నటుడిగా హీరోగా బండ్ల బాబు గుర్తింపు దక్కించుకుంటాడు అనే నమ్మకంతో ఉన్నారు. ఒత్తు సెరుప్పు సైజ్ 7 సినిమా ఒక మంచి కాన్సెప్ట్‌ తో రూపొందింది. ఆ కాన్సెప్ట్‌ కు తెలుగు నేటివిటీని అద్ది తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు నటుడిగా మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు ముందు ముందు బండ్ల గణేష్ కు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

డేగల బాబ్జీ అనే టైటిల్‌ చాలా విభిన్నంగా బండ్ల గణేష్‌ కు యాప్ట్‌ అయ్యేలా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే కొందరు మాత్రం సినిమాతో బండ్ల గణేష్‌ హీరోగా కూడా సక్సెస్ దక్కించుకోబోతున్నట్లుగా టైటిల్ చూస్తుంటే అనిపిస్తంఉది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా యష్‌ రిషి ఫిల్మ్స్ బ్యానర్ లో స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఎక్కువ సమయం తీసుకోకుండా సింగిల్ షెడ్యూల్‌ లోనే రెండు నెలల్లోనే ముగించేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. సినిమాను థియేటర్ల ద్వారా ఓటీటీ ద్వారా విడుదల చేస్తారా అనేది చూడాలి. బండ్ల హీరోగా మొదటి సినిమా కనుక థియేటర్ల ద్వారా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి మేకర్స్ నిర్ణయం ఏంటీ అనేది చూడాలి.
Tags:    

Similar News