ఉత్తమ డ్రామా వెబ్ సిరీస్ జాబితాలో ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు ను దక్కించుకున్న ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అత్యధికులు ఈ వెబ్ సిరీస్ ను చూశారు అంటూ నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు అంటున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన సామూహిక నిర్భయ రేప్ ఉదంతం నేపథ్యంలో ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ ను రూపొందించారు. రిచీ మెహతా సారథ్యంలో రూపొందిన ఈ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయినప్పటి నుండి కూడా సీజన్ 2 కోసం ప్రేక్షకులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ 2019 సంవత్సరం మార్చి 22న ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. మొత్తం 12 ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేశారు. ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 కోసం వెయిట్ చేసిన ప్రేక్షకుల ముందుకు ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
మొదటి సీజన్ లో ఉన్నంత డ్రామా మరియు ఆసక్తిక ఎలిమెంట్స్ రెండో సీజన్ లో మిస్ అయ్యాయి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నిర్భయ సంఘటన నేపథ్యంలో సీజన్ 1 రూపొందగా దాదాపుగా ముప్పై ఏళ్ల క్రితం కచ్చా బనియన్ గ్యాంగ్ జరిపిన దారుణాలు సీజన్ 2 లో చూపించారు.
ఒంటరిగా దొరికిన వృద్దులను ఆ గ్యాంగ్ అత్యంత దారుణంగా చంపేయడంను వెబ్ సిరీస్ లో చూపించారు. ఆ గ్యాంగ్ ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు.. వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేది కథాంశంగా వెబ్ సిరీస్ ను రూపొందించారు. పోలీసులు చాలా చాకచక్యంగా వారిని కనిపెట్టి పట్టుకుంటారు. దాంతో సిరీస్ ముగిసింది.
మొదటి సీజన్ తో పోల్చితే రెండవ సీజన్ తేలిపోయింది. అయితే మొదటి సీజన్ గురించి పట్టించుకోకుండా ఓపెన్ మైండ్ తో రెండవ సీజన్ ను చూస్తే పర్వాలేదు అన్నట్లుగా ఉంది. త్వరలోనే మూడవ ఢిల్లీ క్రైమ్ కూడా పట్టాలెక్కే అవకాశాలు లేకపోలేదు అంటూ బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.