బిగ్ బాస్ నుండి నిన్నటి ఎపిసోడ్ లో టీవీ9 దేవిని ఎలిమినేట్ చేస్తున్నట్లుగా నాగార్జున ప్రకటించగానే అంతా షాక్ అయ్యారు. నిన్న ఉదయం నుండి దేవి ఎలిమినేట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం బలంగా వినిపించింది. కాని అది ఫేక్ ప్రచారం అనుకున్నారు. కాని అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా దేవి ఎలిమినేట్ అంటూ నాగార్జున చెప్పడం జరిగింది. ఆమె ఎలిమినేషన్ విషయంలో నాగార్జున కూడా చాలా బాధ పడ్డట్లుగా అనిపించింది. హౌస్ లో ఉన్న అతి కొద్ది బలమైన కంటెస్టెంట్స్ లో ఆమె ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనకంటూ ఉన్న ఆ ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఆమెకు ప్లస్ అయ్యింది.. అదే ఆమెకు మైనస్ కూడా అయ్యింది అనిపిస్తుంది.
టీవీ9 దేవికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఖచ్చితంగా ఆమెకు చాలా మంది ఓట్లు వేస్తారు అనుకున్న వారు ఆమెకు ఓట్లు వేయలేదేమో అనిపిస్తుంది. ఆమె సేవ్ అవుతుందనే అతి నమ్మకం వల్లనో లేదా మరేంటో కాని ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేయక పోవడంతో ఎలిమినేషన్ అయ్యింది. కుమార్ సాయి.. మెహబూబ్ వంటి వీకెస్ట్ కంటెస్టంట్స్ ఉన్నా కూడా ఆమె ఎలిమినేట్ అవ్వడంపై బిగ్ బాస్ ప్రేక్షకులు తీవ్ర ఆక్షేపణ పెడుతున్నారు. హౌస్ లో ఆమె చాలా ఎగ్రసివ్ గా ఉండటంతో పాటు టాస్క్ లో ఆమె పడే కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అలాంటి ఫైటర్ ను ఎలిమినేట్ చేస్తే షో పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గడంతో పాటు చూసేందుకు కూడా ప్రేక్షకులు ఇష్టపడరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే దేవి ఎలిమినేట్ అవ్వడంతో మేము బిగ్ బాస్ చూడమంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టారు. దేవి.. సూర్య కిరణ్ వంటి మెచ్యూర్డ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయితే మిగిలేది మొత్తం పులిహోర బ్యాచే కదా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పులిహోరా కలుపుతున్న సీన్స్ తో షో ను నడిపించేందుకు ప్రయత్నాలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ నెటిజన్స్ బిగ్ బాస్ నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు.