త్రివిక్రమ్ - దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరూ ఇద్దరే. ఒకరేమో మాటల మాంత్రికుడు - ఇంకొకరు మ్యూజిక్ మాంత్రికుడు. ఇద్దరూ కలిస్తే.. సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే. జల్సా మొదలైన వీరిద్దరి పయనం.. సన్ ఆఫ్ సత్యమూర్తి వరకు బాగానే కొనసాగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. ఇద్దరూ కలిసి సినిమాలే తీయలేదు. ఇద్దరి మధ్య ఇగో వల్ల గ్యాప్ వచ్చేసిందని ఇండస్ట్రీలో చాలా మంది చెప్తారు. ఇంకా చెప్పాలంటే సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత దేవిశ్రీ - త్రివిక్రమ్ కలిసి బయట ఎక్కడా కన్పించలేదు. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అ ఆ - అజ్ఞాతవాసి - అరవింద సమేత వీర రాఘవ సినిమాలు చేశాడు త్రివిక్రమ్. ఇందులో అజ్ఞాతవాసి ఫ్లాప్ అయితే.. మిగతా రెండూ ఆడాయి. అయితే పాటల పరంగా మాత్రం.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినంత కిక్ మాత్రం ఇవ్వలేదనే ఒప్పుకోవాలి.
వినయ విధేయ రామ ఆడియో పుణ్యమా అంటూ.. దేవీ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ ఒకే వేదికపై చాన్నాళ్ల తర్వాత కన్పించారు. కన్పించడమే కాదు.. ఇద్దరు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని.. తమ మధ్య ఎలాంటి భేదాలు లేవని చెప్పేందుకు బాగానే కష్టపడ్డారు. సినిమా ఫంక్షన్ అయ్యేంతవరకు పక్క పక్కనే ఉన్నారు. సో.. రామ్ చరణ్ ఆడియో వల్ల.. త్రివిక్రమ్ శ్రీనివాస్ - దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరూ తమ ఇగోల్ని పక్కనపెట్టి కలిసిపోయారు. దీంతో.. త్రివిక్రమ్-మెగాస్టార్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు దేవిశ్రీయే బాణీలు అందిస్తాడనే విషయం దాదాపుగా కన్ ఫర్మ్ అయిపోయినట్లే లెక్క.