డీఎస్పీ మళ్లీ వచ్చినాడా??

Update: 2018-05-25 04:13 GMT
ఎనర్జిటిక్ హీరో రామ్- రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. వీరిద్దరిదీ సూపర్ డూపర్ కాంబో. రామ్ కోసం అతని ఎనర్జీకి తగినట్లుగా స్పెషల్ గా ట్యూన్స్ కట్టి ఇస్తుంటాడు దేవిశ్రీ. ఇప్పుడు అర్జంటుగా హిట్టు కావాల్సిన పరిస్థితుల్లో ఉన్న రామ్.. తన కొత్త సినిమాకు మొదటగా దేవిశ్రీనే కావాలని పట్టుపట్టాడు కానీ సాధ్యం కాలేదు.

త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో మామా అల్లుళ్ల పోరాటం నేపథ్యంలో సాగే 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రం ఇప్పటికి దాదాపుగా సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరా నాటికి థియేటర్లలోకి తేవాలన్నది నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా తీసుకున్న నిర్ణయం. అయితే.. షూటింగ్ సగభాగం పూర్తయ్యేలోపు.. కంపోజర్ విషయంలో ఇప్పటికి రెండు సార్లు మార్పులు జరిగాయి. మొదట దేవిశ్రీ ప్రసాద్ ను ఖాయం చేసుకున్నా.. బిజీ షెడ్యూల్ కారణంగా కుదరదని తేల్చేశాడు రాక్ స్టార్. ఆ తర్వాత దేవిశ్రీ ప్లేస్ ను.. ఈ మధ్యన లవ్ స్టోరీస్ కు అదిరిపోయే ట్యూన్స్ కడుతున్న థమన్ చేతిలో పెట్టారు.

కానీ ఇప్పుడు మళ్లీ డీఎస్పీతోనే సంగీతం ఇప్పించాలని నిర్ణయించారట. ఓ నెల రోజులు రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్నప్పటి నుంచి.. నిర్మాత వెర్షన్ కూడా ఇలాగే మారిందట. ఈ సారి దేవిశ్రీ కూడా అభ్యంతరాలు ఏమీ చెప్పలేదని.. తనకు ఆ టైం సరిపోతుందని అన్నాడట. దీంతో రామ్ మూవీకి మరోసారి రాక్ స్టార్ సంగీతం అందించడం ఖాయమైంది.
Tags:    

Similar News