ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చినా, టాలీవుడ్ లో మన దేవి శ్రీ ప్రసాద్ కి ఒక ప్రత్యేక స్థానం కచ్చితంగా ఉంది. ఎప్పుడో 1999 లో కెరీర్ మొదలుపెట్టిన దేవికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికీ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు అంటేనే అర్థమైపోతోంది అతని రేంజ్ ఏంటో. ఈమధ్యనే ఒక ఫ్యాన్ తన అభిమానాన్ని చాటుకుంటూ దేవి ఎందుకు నెంబర్ వన్ మ్యూజిక్ డైరక్టర్ అని చెప్పే ప్రయత్నం చేశాడు.
నాన్ బాహుబలి లిస్ట్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన టాప్ 5 చిత్రాల పేర్లు చెప్పాడు సదరు అభిమాని. అన్నిటికీ దేవినే మ్యూజిక్ అందివ్వడం విశేషం. అదే తెలియజేస్తూ "నాన్ బాహుబలి టాప్ 5 రంగస్థలం - ఖైదీ నెంబర్ 150 - భరత్ అనే నేను - శ్రీమంతుడు - జనతా గెరేజ్.. అన్నిటికీ డి ఎస్ పి నే.. ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్1 అతడే" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇంకో విశేషమేంటంటే దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా ఆ పోస్టును రిట్వీట్ చేసి నెంబర్ 1 అని చెప్పకనే చెబుతున్నాడు. కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈమధ్య తన మ్యూజిక్ లో క్వాలిటీ తగ్గుతుందని దానిపై దృష్టిపెట్టమంటూ కోరారు. మొదటి అయిదు సినిమాలే కాక టాప్ 10 సినిమాలలో చాలా వాటికి కూడా దేవినే స్వరాలు చేకూర్చాడు.. నో డౌట్.. కాని మ్యూజిక్ క్వాలిటీ మీద ఇంకా ఫోకస్ చేయాలని అంటున్నారు సంగీత ప్రియులు.