ఈ తరం సంగీత దర్శకులు తెలుగు సినిమా సంగీతం గురించి.. దాని గొప్పతనం గురించి బోలెడన్ని మాటలు చెబుతూ ఉంటారు. అత్యున్నత స్థాయి అంటూ మ్యూజిక్ ఫంక్షన్లలోను అవార్డు ఫంక్షన్లలోను హడావిడి చేస్తుంటారు. కానీ రియాల్టీ చూస్తే.. బాగా తేడాగా కనిపిస్తూ ఉంటుంది.
జనతా గ్యారేజ్ మూవీ కోసం రఘు దీక్షిత్ ను మరోసారి పట్టుకొస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మూడు పాటలు వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి. సన్నాఫ్ సత్యమూర్తిలో చల్ చలే చలో.. శ్రీమంతుడులో జాగోరె జాగో.. నాన్నకు ప్రేమతోలో డోంట్ స్టాప్ పాటలు పాడాడు రఘు దీక్షిత్. ఇప్పుడు జనతా గ్యారేజ్ లో కూడా ఓ సూపర్బ్ లిరిక్ ని ఈ సింగర్ పాడాడని తెలుస్తోంది. సినిమా మొత్తంలోకి ఈ పాటే హైలైట్ అవుతుందని.. డీఎస్పీ పాడిన పాట కంటే రఘు దీక్షిత్ పాడిన పాటకే డెప్త్ ఎక్కువ అని తెలుస్తోంది.
మరోవైపు సాయిధరం తేజ్ కోసం ధనుష్ తో ఓ పాట పాడించాడు థమన్. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరూ ఇలా పక్క భాషల వాళ్లతో పట్టి పట్టి పాడించడమే సరిపోతోంది. చెప్పే మాటలు వింటుంటే మాత్రం టాలీవుడ్ స్థాయి అంటూ చాలా గ్రాండ్ గా ఉంటున్నాయి. తెలుగులో పాడగలిగే వాళ్లు దొరకరని అనుకుంటారో.. అసలు ఆ స్థాయి సింగర్స్ ఉండరని భావిస్తారో చెప్పలేం కానీ.. ఈ కంపోజర్స్ ఇద్దరూ తెలుగు సినిమా మ్యూజిక్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు.