టాలీవుడ్ లో రౌడీ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో రామ్ గోపాల్ వర్మ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులకు చూపించాడు. వర్మ దర్శకుడిగా పరిచయమైన నాగార్జున 'శివ' సినిమాని కూడా బెజవాడలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసారు. ఇక నాగ చైతన్య 'బెజవాడ' సినిమా కూడా అదే నేపథ్యంలో వచ్చేందే. 'వంగవీటి' సినిమాలో బెజవాడ రౌడీయిజం ఎలా స్టార్ట్ అయింది అనే కోణంలో చెప్పాల్సిందంతా చూపించేసాడు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్ తో ఓ చిన్న సినిమా రాబోతుంది. 'దేవినేని' పేరుతో తెరకెక్కతున్న ఈ సినిమాలో ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి వంగవీటి రంగా పాత్రలో నటిస్తున్నాడు. ఇక దేవినేని పాత్రలో నందమూరి తారకరత్న కనిపించనున్నారు. శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో జి.ఎం.ఎన్ ఫిలిమ్స్ మరియు ఆర్.టి.ఆర్ ఫిలింస్ బ్యానర్స్ పై జి.ఎస్.ఆర్.చౌదరి - రాము రాథోడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కోటి రీ రికార్డింగ్ అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
కాగా వంగవీటి రంగా జయంతి సందర్భంగా వంగవీటి రంగా పాత్ర పోషిస్తున్న సురేష్ కొండేటికి సంబంధించిన స్టిల్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఆనాటి మహాభారతం రామాయణం కథల్లో ఏముందో మనందరికీ తెలుసు. విజయవాడలో దేవినేని నెహ్రూ - వంగవీటి రంగాల మధ్య ఏం జరిగిందో కొంతే తెలుసు. వారిద్దరి మధ్య ఎలాంటి సంఘర్షణ జరిగింది.. అది ఘర్షణకు ఎలా దారితీసింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోందని.. ఈ సినిమా త్వరలో థియేటర్లోనే విడుదలవుతుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు సేమ్ స్టోరీతో ఎన్ని సినిమాలు తీస్తారు అని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా కరోనా టైం లో ఇలాంటి సినిమాలు గల్లంతవడమే అనే ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో 'దేవినేని' మూవీపై వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే రిలీజ్ అయ్యే దాకా వేచి చూడాల్సిందే.