ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. తెలుగు తమిళ భాషల్లో రెండు దశాబ్దాలుగా నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగారు. కాకపోతే గత కొన్నేళ్లుగా డీఎస్పీ హవా తగ్గిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ ఎస్ థమన్ ఆధిపత్యం మొదలైన తర్వాత దేవిశ్రీ రేసులో కాస్త వెనకబడిపోయారు. అయితే ఇటీవల వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమాతో మరోసారి డీఎస్పీ గురించి అందరూ మాట్లాడుకులేనా చేసింది. ప్రస్తుతం దేవీ మ్యూజిక్ అందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో 'ఖిలాడీ' ఒకటి.
మాస్ మహారాజా రవితేజ - డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ''ఖిలాడి''. జయంతి లాల్ గడ సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న తెలుగు హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ కోసం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన ఐదు పాటలు ఇప్పటికే బయటకు వచ్చాయి.
అయితే పాటలు ఆశించిన స్థాయిలో లేవనే కామెంట్స్ వచ్చాయి. టేకింగ్ వల్ల యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వల్ల వచ్చాయే కానీ.. పాటలు వినడానికి సోసోగా ఉన్నాయనే అన్నారు. అయితే తాజాగా దర్శకుడు రమేష్ వర్మ ఓ ఇంటర్వ్యూలో 'ఖిలాడీ' పాటల గురించి దేవిశ్రీ గురించి మాట్లాడారు.
''దేవిశ్రీ ప్రసాద్ నాకు 15 ఏళ్ళ నుంచి తెలుసు. కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు స్నేహితులం కాబట్టి సాయంత్రం 6 గంటల నుంచి అవీ ఇవీ ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఉన్నాం. మిడ్ నైట్ 2 గంటలకు కథ చెప్పండి అన్నాడు. కథ చెప్పడం పూర్తయ్యేసరికి మూడున్నర నాలుగు గంటలు అయింది. అప్పటికప్పుడు మొదలుపెట్టి అర గంటలో అన్ని పాటలు ఇచ్చేసాడు. అర్థ గంటలో ఆరు ట్యూన్స్ ఇచ్చాడు. అప్పుడే ట్యూన్స్ అన్నీ ఓకే అనుకున్నాం. తర్వాత పాటలు రికార్డ్ చేసి పంపించారు. ఆరు పాటలు ఇచ్చాడు కానీ.. సినిమాలో ఐదో పెట్టుకున్నాం. అన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి'' అని రమేష్ వర్మ చెప్పుకొచ్చారు.
దేవిశ్రీ పాటల గురించి రమేష్ వర్మ గొప్పగానే అర గంటలోనే ఆరు పాటలు ఇచ్చారని చెప్పారు కానీ.. నెటిజన్స్ మాత్రం అంత తక్కువ టైములో కంపోజ్ చేసారు కాబట్టే అవుట్ ఫుట్ అలా మాములుగా వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. డీఎస్పీ మరింత శ్రద్ధ, సమయం పెట్టి పని చేసినట్లే అదిరిపోయే ట్యూన్స్ వచ్చేవి కదా అని అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి సినిమాకు దేవిశ్రీ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో తెలియాలంటే 'ఖిలాడీ' రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'భవదీయుడు భగత్ సింగ్' - రామ్ పోతినేని 'ది వారియర్' - చిరంజీవి 'Chiru154' - అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్' - వెంకటేష్ & వరుణ్ తేజ్ ల 'ఎఫ్ 3' - శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' వంటి చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్నారు.