'ధమాకా' మూవీ రివ్యూ
నటీనటులు: రవితేజ-శ్రీ లీల-జయరాం-సచిన్ ఖేద్కర్-తనికెళ్ల భరణి-రావు రమేష్-చిరాగ్ జాని-శ్రీతేజ్-ఆలీ-ప్రవీణ్-హైపర్ ఆది-తులసి-పవిత్ర లోకేష్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
కథ-స్క్రీన్ ప్లే-మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ
నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
గత ఏడాది 'క్రాక్'తో చాన్నాళ్లకు ఒక బ్లాక్‌బస్టర్ అందుకున్నప్పటికీ.. ఈ ఏడాది 'ఖిలాడి'.. 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు మాస్ రాజా రవితేజ. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం 'ధమాకా' మీద ఆయన చాలా ఆశలతోనే ఉన్నారు. హ్యాట్రిక్ హిట్లు కొట్టిన రైటర్-డైరెక్టర్ జోడీ ప్రసన్నకుమార్-త్రినాథరావు కలయికలో వస్తున్న కొత్త చిత్రం కావడం.. ట్రైలర్ వినోదాత్మకంగా సాగడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను అందుకుంటూ రవితేజ కోరుకుంటున్న విజయాన్ని ఈ సినిమా అందించేలా ఉందో లేదో చూద్దాం పదండి.
కథ:
అతి కష్టం మీద ఉద్యోగం సంపాదించి.. చెల్లి పెళ్లి చేయాల్సిన టైంలో అది కూడా పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి కుర్రాడు స్వామి (రవితేజ).. వేల కోెట్ల కంపెనీకి సీఈవో అయిన వివేక్ (రవితేజ) చూడ్డానికి ఒకేలా ఉంటారు. స్వామి తనకు ప్రపోజ్ చేయడంతో అతణ్ని పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న ప్రణవి (శ్రీలీల)కు ఆమె తండ్రి వివేవ్ తో పెళ్లికి ప్రపోజల్ పెడతాడు. వీళ్లిద్దరితో ట్రావెల్ చేసి నచ్చిన వ్యక్తిని పెళ్లాడదామని అనుకుంటుంది ప్రణవి. ఆ ఇద్దరూ కూడా ప్రణవిని ఇష్టపడతారు. ఇదిలా ఉండగా.. వివేక్ కంపెనీ మీద జేకే (జయరాం) అనే బిజినెస్ మ్యాన్ కన్నేస్తాడు. దాన్ని చేజిక్కించుకునే పన్నాగం పన్నుతాడు. మరి కుట్ర ఎంతమేర ఫలించింది.. వివేక్-స్వామిల్లో ప్రణవి ఎవరిని ఎంచుకుంది.. ఇంతకీ వివేక్-స్వామి ఇద్దరూ ఒకేలా ఎందుకున్నారు.. వీరి మధ్య బంధం ఏంటి.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెర మీదే చూడాలి.
కథనం-విశ్లేషణ:
రవితేజ అంటే మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరు. ఆయన్నుంచి ప్రేక్షకులు ఎక్కువగా ఆశించేది మాస్-యాక్షన్ ఎంటర్టైనర్లే. కానీ ఎంత మాస్ అయినా సరే.. అవే చేస్తుంటే మొహం మొత్తేస్తుంది. ప్రేక్షకులు ఎంతో కొంత కొత్తదనం కోరుకుంటారు. అందుకే ఆయన అప్పుడప్పుడూ ఓ డిఫరెంట్ మూవీ చేస్తుంటాడు. కానీ అవి బోల్తా కొట్టేస్తుంటాయి. ఈ ఏడాది అలా ట్రై చేసిన సినిమానే.. రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా చూసి ప్రేక్షకులు రవితేజకు దండం పెట్టేశారు. నీకు సూటయ్యే మాస్ బొమ్మలేవో చేసుకోవయ్యా అనేశారు. కానీ మాస్ బొమ్మ అంటే.. చేసిన కథనే మళ్లీ మళ్లీ చేయమని మాత్రం కాదు. 'ధమాకా' లాంటి కథలతో సినిమాలు ఎన్నొచ్చాయంటే చెప్పడానికి చేతులతో పాటు కాళ్లల్లో ఉన్న వేళ్లు కూడా సరిపోవు. సినిమా మొత్తంలో కొత్తగా ఉంది అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ లేదు. సీనుకో సినిమాను గుర్తు చేస్తూ పరమ రొటీన్ మాస్ వినోదంతో రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ.. డైరెక్టర్ త్రినాథరావు జోడీ సినిమా మొదలైన కాసేపటికే 'ఔట్ డేటెడ్' ఫీలింగ్ ఇచ్చేస్తుంది. మాస్ రాజా తన వంతుగా సినిమాను ఎంత కాపాడదామని చూసినా కూడా.. ఈ రొటీన్ బొమ్మ ఆయనకు ఛాన్స్ లేకుండా చేసింది.
రవితేజతో సినిమా ఓకే అవ్వగానే వింటేజ్ మాస్ రాజాను చూపిస్తూ ఆయన ఎనర్జీని ఫుల్లుగా వాడుకోవాలని ప్రసన్నకుమార్-త్రినాథరావు ఫిక్సయినట్లున్నారు. వెంకీ.. విక్రమార్కుడు.. డాన్ శీను.. ఆంజనేయులు తదితర చిత్రాల్లోని అల్లరి రవితేజను తెరపై ప్రెజెంట్ చేయడానికి చూశారు. ఆరంభంలో రెండు మూడు సీన్లు చూస్తే మాస్ రాజా తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఇంట్రో ఫైట్లో.. ఆ తర్వాత హీరోయిన్ని ఏడిపించిన రౌడీ బ్యాచుతో గొడవలో కాన్వర్జేషన్లు సరదాగా అనిపిస్తాయి. మాస్ రాజాను 'ధమాకా' రైటర్-డైరెక్టర్ బాగానే వాడుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ క్యారెక్టర్ ఇంట్రో వరకు బాగున్నా.. కథలోకి దిగాకే మొదలైంది అసలు సమస్య. ఓ సీన్లో జయరాం ఏదో డైలాగ్ చెబితే.. ''మీరు త్రివిక్రమ్ చుట్టమా సార్'' అంటాడు రవితేజ. ఈ సీన్-డైలాగ్ రాయడానికే కాదు.. 'ధమాకా' కథ రాయడానికి కూడా త్రివిక్రమే స్ఫూర్తిగా నిలిచినట్లున్నాడు ప్రసన్నకు. త్రివిక్రమ్ సినిమాల్లోనే మొహం మొత్తేసి ఇక చాలు స్వామీ అని జనాలతో అనిపించిన 'కంపెనీ టేకోవర్' కాన్సెప్ట్ మీద ఈ సినిమానంతంటినీ నడిపించాలని అనుకోవడం విడ్డూరం. రవితేజ రెండు పాత్రల మధ్య కనెక్షన్ ఏంటనే విషయంలో సస్పెన్స్.. దీనికి సంబంధించి ఇంటర్వెల్ ట్విస్టు ప్రథమార్ధంలో ఆసక్తిని కొంచెం నిలిపి ఉంచుతాయి. కానీ కథ పరంగా మాత్రం ముందే ఆసక్తి సన్నగిల్లిపోతుంది.
ఫస్టాఫ్ లో కొన్ని మెరుపులైనా ఉన్నాయి కానీ.. రెండో అర్ధంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. విలన్ల దగ్గర అమాయకంగా నటిస్తూ గేమ్ ఆడే పాత్రను రవితేజ ఎన్నిసార్లు చేశాడో లెక్కలేదు. విలన్లను ముందే జోకర్లను చేసేయడంతో ఇక కథ పరంగా ఏమాత్రం ఆసక్తి ఉండదు. ఈ 'డబుల్ గేమ్' చుట్టూ నడిచే సన్నివేశాలు 'ధమాకా' గ్రాఫ్ ను పూర్తిగా కిందికి దించేస్తాయి. రవితేజ నటన కూడా చాలా రొటీన్ గా అనిపిస్తుంది ఈ సీన్లలో. అప్పుడప్పుడూ తెరపై వచ్చి హైపర్ ఆది వేసే 'జబర్దస్త్' పంచులే కొంచెం రిలీఫ్ గా అనిపిస్తాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పల్సర్ బండి పాటకు రవితేజ-శ్రీలీల స్టెప్పులేసే మూమెంట్ బాగున్నా.. అది వచ్చే సందర్భమే సరిగా కుదరలేదు. పతాక సన్నివేశాల గురించైతే చెప్పడానికి ఏమీ లేదు. ముగింపులోనూ 'ఔట్ డేటెడ్' ఫీలింగే కలుగుతుంది. మొత్తంగా చూస్తే కొన్ని సన్నివేశాల వరకు రవితేజ అల్లరి.. మాస్ మెచ్చే పాటలు.. కొన్ని పంచు డైలాగులు మినహాయిస్తే.. 'ధమాకా'లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.
నటీనటులు:
రవితేజ తన అభిమానులు కోరుకునేలా కనిపించాడు. మాస్ వినోదాన్ని అందించడానికి ప్రయత్నించాడు. ఈ వయసులోనూ హుషారేమీ తగ్గకుండా ఒకప్పటి స్థాయిలో అల్లరల్లరి చేశాడు. కానీ సగటు ప్రేక్షకులకు ఆయన పాత్ర.. నటన మరీ రొటీన్ గా అనిపిస్తాయి. శ్రీలీల అందంగా కనిపించి ఆకట్టుకుంది. రవితేజ పక్కన ఆమె చిన్నపిల్లలా అనిపించడం ఇబ్బంది పెట్టినా తన వరకు కుర్రాళ్లను ఆకర్షించేలా ఉంది. నటన కూడా పర్వాలేదు. విలన్ పాత్రలో జయరాం మెరిశాడు. సచిన్ ఖేద్కర్ తనకు సూటయ్యే పాత్రలో కనిపించాడు. హైపర్ ఆది జబర్దస్త్ స్టయిల్ జోకులతోనే నవ్వించాడు. రావు రమేష్ తో ఆదికి కాంబినేషన్ బాగానే కుదిరింది. శ్రీతేజ్.. తనికెళ్ల భరణి.. తులసి.. పవిత్ర లోకేష్.. వీళ్లంతా ఓకే.
సాంకేతిక వర్గం:
ఎక్కువగా చిన్న సినిమాలకే పని చేసిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో.. తన కెరీర్లో దక్కిన అతి పెద్ద అవకాశాన్ని బాగానే ఉపయోగించుకున్నాడు. ఒక మాస్ సినిమాకు సరిగ్గా సూటయ్యే పాటలు అందించాడు. మాస్ రాజా ఎనర్జీకి తగ్గ ట్యూన్లు ఇచ్చాడు. జింతాక్ జింతాక్.. మాసు రాజా లాంటి పాటలతో పాటు అతనిచ్చిన బీజీఎం బిట్స్ కూడా మాస్ ను ఆకట్టుకునేలా సాగాయి. నేపథ్య సంగీతం కూడా బాగానే కుదిరింది. కార్తీక్ ఘట్టమనేని తన కెమెరా పనితనంలో క్వాలిటీ చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా రిచ్ గా అనిపిస్తుంది. ఎటొచ్చీ రైటింగ్ దగ్గరే 'ధమాకా' తేడా కొట్టేసింది. రైటర్ ప్రసన్నకుమార్ మాస్ రాజా ఎనర్జీని చూపించే కొన్ని సీన్లు రాసినా.. అతడి డైలాగుల్లో పంచులు బాగానే పేలినా.. మరీ అరిగిపోయిన కథను ఎంచుకోవడం మైనస్ అయింది. రైటింగ్ దగ్గరే తప్పు జరగడంతో దర్శకుడు త్రినాథరావు కూడా ఏమీ చేయలేకపోయాడు.
చివరగా: ధమాకా.. రొటీన్ మాస్ బొమ్మ
రేటింగ్-2.5/5