'ధ‌మాకా' ట్రైల‌ర్ లాక్..15 నుంచి త‌డాఖా!

Update: 2022-12-12 04:43 GMT
మాస్ మ‌హారాజా ర‌వితేజ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ర‌వితేజ చేతిలో మూడు సినిమాలున్నాయి.  'ధ‌మాకా'తో పాటు..'టైగ‌ర నాగేశ్వ‌ర‌రావు' ఆన్ సెట్స్ లోఉన్నాయి. ఆశ‌ల‌న్నీ ధ‌మాకాపైనే క‌నిపిస్తున్నాయి.  'ధ‌మాకా' ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్.  త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాపై  రాజా స‌హా అభిమానులు చాలా ఆశ‌లే పెట్టుకున్నారు.

త్రినాధ‌రావుకి ఇంత‌వ‌ర‌కూ వైఫ‌ల్యం లేదు. క‌మర్శియ‌ల్ మేక‌ర్ గా మంచి పేరు సంపాదించాడు. ఆయ‌న సినిమాల‌న్ని యూత్ కంటెంట్ తోనే ఉంటాయి. ఆ కోవ‌లో  'ధ‌మాకా' పై అంచ‌నాలు గెస్ చేయోచ్చు. కొంత వ‌ర‌కూ ర‌వితేజ సేఫ్ జోన్ లో ఉన్న‌ట్లే. అన్ని ప‌నులు పూర్తిచేసి ఈనెల 23న  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ చేస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో యూనిట్ ప్ర‌చార ప‌ర్వాన్ని వేగ‌వంతం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో మంచి బ‌జ్ క్రియేట్ అయింది. టీజ‌ర్..లిరిక‌ల్ సింగిల్స్ కి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.  తాజాగా ఈనెల 15న‌ ట్రైల‌ర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్ చేసారు.  కొత్త పోస్ట‌ర్ లో ర‌వితేజ సూట్ ధ‌రించి..క‌ళ్ల జోడు పెట్టుకుని క్లాస్ గా క‌నిపిస్తున్నాడు.

ఇందులో ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేస్తోన్న‌నేప‌థ్యంలో ఆ  రెండింటిలో ఒక లుక్ గా తెలుస్తోంది. మ‌రి మ‌రో పాత్ర‌లో ఎలాంటి లుక్ తో ఆక‌ట్టుకుంటాడో చూడాలి. రెండు పాత్ర‌లు వినోదాత్మ‌కంగానే సాగుతాయ‌ని స‌మాచారం. అలాగే యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు కొందవుండద‌ని తెలుస్తోంది.

ఇందులోర‌వితేజ‌కి జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల న‌టిస్తోంది. ఇద్దరి మ‌ద్య రొమాంటిక్ స‌న్నివేశాలు ఆస‌క్తిక‌ర‌మ‌నే తెలుస్తోంది. శ్రీలీల‌ను ఏరికోరి మ‌రి ఎంపిక చేసారు. ఆ పాత్ర‌కి ఆమె మాత్ర‌మే న్యాయం చేగ‌ల‌ద‌ని భావించి సీన్ లోకి తెచ్చారు. మ‌రి ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.

ఈ చిత్రానికి   ప్రసన్న కుమార్ బెజవాడ కథ.. స్క్రీన్‌ప్లే ..సంభాషణలు అందిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News