రూ.100 జీతంతో సినీ కెరీర్ ప్రారంభించాడు ధన్ రాజ్. రోజుకి మినిమం 20వేల నుంచి 30వేల మధ్య పారితోషికం అందుకునే రేంజుకి ఎదిగాడు. బక్కపలచని రూపం.. అందుకు తగ్గట్టు ఆహార్యం ధన్ రాజ్ కి పెద్ద ప్లస్. తనకంటూ ఓ ప్రత్యేక శరీరభాషతో తొలినాళ్లలో ఆకట్టుకుని ఇప్పుడున్న కమెడియన్ల లో తనకంటూ ఓ మార్క్ ఉందని నిరూపించుకోగలిగాడు.
ఇప్పటికైతే కెరీర్ పరంగా ఢోకా లేకుండా ముందుకు సాగుతున్నాడు. ఇటీవలి కాలంలో క్షణం తీరిక లేని షెడ్యూళ్ల తో బిజీ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఓ వైపు వెండితెర, మరోవైపు బుల్లితెర రెండుచోట్లా ఫేమస్ పర్సనాలిటీ ధన్ రాజ్. ఈటీవీ జబర్ధస్త్ షోతో పల్లె పట్టున కూడా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
లేటెస్టుగా ధన్ రాజ్ కథానాయకుడిగా నటించిన 'ధనలక్ష్మి తలుపు తడితే' చిత్రం రిలీజ్ కి వస్తోంది. ఈ సినిమాలో డబ్బు కోసం వేట సాగించే బృందంలో అతడు ఒకడిగా కనిపించబోతున్నాడు. అయితే ధన్ రాజ్ డబ్బు వేట ఎంతవరకూ ఫలిస్తుంది? వేటలో గెలుపు సాధిస్తాడా? అసలు ధన్ రాజ్ డబ్బులు ఉంటాయా? పోతా? ఇన్ని సందేహాలున్నాయి ఆడియెన్ కి. వీటన్నిటికీ సమాధానం కావాలంటే ఈనెల 31 వరకూ వేచి చూడాల్సిందే.