ఈవిడ‌గారు గాయ‌ప‌డితే సినిమా హిట్టే

Update: 2015-11-27 04:54 GMT
అర‌వాన్ సినిమాతో త‌మిళ్‌ - తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ధ‌న్షిక‌. న‌టిగా ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ అని ఈ సినిమాలు చూసిన‌వారికి అర్థ‌మైంది. క్యారెక్ట‌ర్‌ లో జీవించేసే నాయిక‌గా పాపుల‌ర్ అయ్యింది. అందుకే ఇప్పుడు సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌బాలీ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించే అవ‌కాశం అందుకుంది. ప్ర‌స్తుతం సినిమా ఆన్ సెట్స్ లొ  ఉంది. మ‌లేషియాలో చిత్రీక‌రిస్తున్నారు. సూప‌ర్‌ స్టార్ ఫ్యాన్స్ ఆన్‌ సెట్స్‌ కి వ‌చ్చి ర‌చ్చ‌ర‌చ్చ చేస్తున్నార‌న్న‌ది స‌మాచారం. అయితే ఈ మూవీలో ధ‌న్షిక ర‌జ‌నీకాంత్‌ కి  కూతురు పాత్ర‌లో న‌టిస్తోందని ఇదివ‌ర‌కే చెప్పుకున్నాం.

మాఫియా నుంచి బైటికి వ‌చ్చేసిన ఓ డాన్ .. త‌న కూతురిని కిడ్నాప్ చేసిన వారి అంతు చూసేందుకు తిరిగి మ‌ళ్లీ త‌న పాత వృత్తిలోకి ఎలా వ‌చ్చాడు? అటుపై ఏం చేశాడ‌న్న‌దే క‌బాలీ క‌థాంశం. ఇందులో ర‌జ‌నీ కూతురు ఓ డ్ర‌గ్ ఎడిక్ట్‌. త‌న క్యారెక్ట‌ర్‌ కి స్టంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు  ధ‌న్షిక పెర్ఫెక్ష‌న్ కోసం పాకులాడి గాయాల పాల‌వుతోంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఆన్‌ సెట్స్ రెండు సార్లు కింద ప‌డింది. ఓసారి త‌ల‌కి తీవ్రంగా గాయ‌మై ర‌క్త స్రావ‌మైంది. మ‌రోసారి రోడ్‌ పై ర‌న్నింగ్ సీన్ తీస్తున్న‌ప్పుడు స్కిడ్ అయి ప‌డింది. ఇలా ఇన్నిసార్లు ఈ అమ్మ‌డు దెబ్బ‌లు త‌గిలించుకుంది కాబ‌ట్టి సెంటిమెంటుగా క‌బాలీ పెద్ద హిట్ట‌వుతుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఈవిడ‌కి గాయ‌మైతే సినిమా హిట్టే అంటూ చేస్తున్న ఈ ప్ర‌చారం చూస్తుంటే చాలా సిల్లీగా అనిపించ‌డం లేదూ?
Tags:    

Similar News