రజినీ రీల్‌ కూతురుకు ఎందుకో ఈ విధ్య?

Update: 2018-11-23 12:25 GMT
రజినీకాంత్‌ నటించిన ‘కబాలి’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సాయి ధన్సిక ప్రస్తుతం సౌత్‌ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. రజినీకాంత్‌ కు రీల్‌ కూతురుగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ధన్సిక ప్రస్తుతం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ భాషల్లో కూడా డైరెక్ట్‌ సినిమాలు చేస్తోంది. తెలుగులో ఈమె వాలుజడ అనే విభిన్నమైన చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక కన్నడంలో కూడా ధన్సిక ఎంట్రీ ఇవ్వబోతుంది. హీరోయిన్‌ గా వరుసగా ఆఫర్లు దక్కించుకున్న ముద్దుగుమ్మ ధన్సిక తాజాగా కర్ర సాము నేర్చుకుంటోంది.

ధన్సిక కర్రసాము వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. సహజంగా హీరోయిన్స్‌ ఇలాంటి కష్టమైన విధ్యలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపించరు. కాని ధన్సిక చాలా కష్టపడి కర్ర సాము నేర్చేసుకుంది. ఏదైనా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీలో ధన్సిక నటించబోతుందేమో అంటూ ప్రచారం జరుగుతుంది. హీరోలతో మూడు రొమాంటిక్‌ పాటల్లో కనిపించి, కాస్త గ్లామర్‌ గా కనిపించి, పేరు తెచ్చుకోవాలనుకునే రకం హీరోయిన్‌ కాదు. కష్టపడి, నటిగా గుర్తింపు దక్కించుకోవాలనుకునే హీరోయిన్‌. అందుకే ఇంతగ కర్ర సాము చేస్తూ కష్టపడుతోంది అంటున్నారు ఆమె సన్నిహితులు.
Tags:    

Similar News