తమిళ నటి ధన్షిక అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. బాల శిష్యుడు వసంత బాలన్ తెరకెక్కించిన అరవాన్ చిత్రంతో తెలుగులో పాపులర్ అయ్యింది. సినిమా ఫ్లాపైనా గొప్ప పెర్ఫామర్ అన్న పేరు తెచ్చుకుంది. బాల దర్శకత్వంలో పరదేశి చిత్రంలోనూ నాయికగా నటించింది. ఈ రెండు సినిమాలు తెలుగులో ఫ్లాపైనా నటిగా మనసులు దోచుకోవడంలో ధన్షిక ఫెయిల్ కాలేదు.
ఇప్పుడు ఈ భామకు సూపర్ స్టార్ రజనీకాంత్ 159వ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కొత్త కుర్రాడు రంజిత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రజనీకాంత్ కి డాటర్ గా నటిస్తోంది. ఈపాటికే సెట్స్ కెళ్లాల్సింది. చిత్రయూనిట్ లో కొందరికి వీసాల సమస్య తలెత్తడంతో సెప్టెంబర్ కి వాయిదా పడిందని చెబుతున్నారు. మలేషియాలో తొలి షెడ్యూల్ పూర్తి చేస్తారని సమాచారం.
ఈ చిత్రంలో రజనీ సరసన లెజెండ్ ఫేం రాధికా ఆప్టే నాయికగా ఆడిపాడుతోంది. ఇదే చిత్రంలో ప్రకాష్ రాజ్, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కాబట్టి.. ధన్షిక దశ తిప్పేసే సినిమా అవుతుందేమో చూడాలి.