హాలీవుడ్ సినిమా అవగొట్టేసిన సౌత్ హీరో

Update: 2017-07-21 11:29 GMT
మన ఇండియన్ యాక్టర్స్ హాలీవుడ్ సినిమాల్లో చిన్న పాత్ర చేసినా గొప్పగా చెప్పుకునేవాళ్లం. కానీ ఈ మధ్య మనవాళ్లు అక్కడ పెద్ద పెద్ద పాత్రలే చేస్తున్నారు. ప్రియాంక చోప్రా.. దీపికా పదుకొనే.. ఇర్ఫాన్ ఖాన్ లాంటి వాళ్లు హాలీవుడ్ భారీ సినిమాల్లో కీలక పాత్రలతో మురిపించారు. ఇప్పుడు ఓ సౌత్ హీరో హాలీవుడ్ సినిమాలో లీడ్ రోలే చేయడం విశేషం. ఆ హీరో మరెవరో కాదు.. ధనుష్. అతను ‘ది ఎక్స్‌ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ ఇన్ పారిస్’ అనే హాలీవుడ్ సినిమా చేయడానికి గత ఏడాదే అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. దర్శకుడు మారడం వల్ల.. ప్రి ప్రొడక్షన్ ఆలస్యం కావడం వల్ల ఈ చిత్రం లేటుగా సెట్స్ మీదికి వెళ్లింది.

కొన్ని నెలల కిందటే రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కాగా.. చాలా వేగంగా ఈ సినిమాను పూర్తి చేసేశారు. ధనుష్ చడీచప్పుడు లేకుండా వెళ్లి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని వచ్చాడు.  ఈ చిత్రానికి కెన్ స్కాట్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇంగ్లిష్ తో పాటు హిందీ డైలాగులు కూడా ఉంటాయట. ఇండియా నుంచి వెళ్లిన అజాత్ శత్రు అనే ఫకీర్ పారిస్ లో ఏం చేశాడనే  కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. పారిస్ లోనే మొత్తం షూటింగ్ పూర్తి చేశారు. ఈ చిత్రం ఏడాది ఆఖర్లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. సోనీ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్ లో పలుదేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
Tags:    

Similar News