కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు అనగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది. శేఖర్ కమ్ముల లాంటి సెన్సిటివ్ డైరెక్టర్ తో తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రంలో నటించేందుకు ధనుష్ ఓకే చెప్పగానే ఇది చాలా ప్రత్యేకత కలిగిన ప్రాజెక్ట్ అన్న భావన అభిమానుల్లో కలిగింది.
అయితే ధనుష్ తో ఎలాంటి సినిమా చేస్తారు? అన్నదానికి రకరకాల ఊహాగానాలు సాగాయి. కమ్ముల ఎప్పటిలానే సున్నిత కుటుంబ ఉద్వేగాలతో నిండిన లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారా? లేక లీడర్ తరహాలో ఏదైనా పొలిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నారా? అంటూ ఆసక్తికర చర్చ సాగింది. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే.
ఈసారి శేఖర్ కమ్ముల ఓ హిస్టారికల్ పీరియడ్ డ్రామాని టచ్ చేయనున్నారు. మద్రాసు నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామా ఇది అని తెలుస్తోంది. మద్రాసు నుంచి తెలుగు వారు విడిపోయినప్పటి ఉద్వేగాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరితో తెరకెక్కనుంది. అటు తమిళనాడు ఇటు తెలుగు రాష్ట్రాల సెన్సిటివిటీస్ ని టచ్ చేస్తూ ఆద్యంతం రక్తి కట్టించేలా స్క్రిప్టును మలిచారని తెలిసింది. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందనేది హిస్టరీ. మద్రాసు నుంచి తెలుగు వారు విడిపోయిన అనంతరం హైదరాబాద్ రాజధానిగా నాటి పాలన సాగింది.
ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభించనున్నారు. బౌండ్ స్క్రిప్ట్ దాదాపు రెడీగా ఉంది. ఏషియన్ నారాయణదాస్ నారంగ్- పుస్కూరు రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.