తమిళనాడు వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగానూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకపక్క ఆయన్ను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటూ ఆయన అభిమానులు బలంగా కోరుకుంటుంటే.. మరికొందరు ఆయన ఎంట్రీ మీద తిట్టిపోస్తున్నారు. ఇలా.. రజనీ రాజకీయ రంగప్రవేశం మీద హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. రజనీ నటించిన రోబో 2.0 చిత్రం విడుదలైన తర్వాత ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మూవీ విడుదలయ్యాక రజనీ సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ.. రోబో 2 విడులయ్యాక బిగ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని రజనీనే స్వయంగా వెల్లడించటం తెలిసిందే.
ఇదే విషయాన్ని ఆయన అల్లుడు ధనుష్ ను అడిగితే.. చిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇవ్వటమే కాదు.. తెగ సిరాకు పడిపోవటం గమనార్హం. రజనీ అల్లుడు తాజాగా నటించిన చిత్రం వీఐపీ 2. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుష్ వద్దకు చేరిన మీడియా ప్రతినిధులు.. రజనీ రాజకీయ రంగప్రవేశం గురించి క్వశ్చన్లు వేయటం షురూ చేశారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఆహ్వానపత్రికలో రాజకీయాల గురించి ప్రశ్నించకూడదని ఉందని చెబుతూ సమాధానం చెప్పటానికి ఇష్టపడలేదు.
అయినప్పటికీ మీడియా ప్రతినిధులు ఎంతకూ తమ ప్రశ్నల పరంపరను వదలకపోవటంతో ధనుష్ రియాక్ట్ అయ్యారు. అయితే.. విలేకరుల ప్రశ్నలకు.. ప్రశ్నలతో సమాధానమిచ్చారు. నటులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. సినీ నటులు రాజకీయాల్లోకి రాకూడదనే అభిప్రాయం మీకేమైనా ఉందా? అని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు తమ అభిప్రాయాల్ని వారితోనే ఉంచుకోవాలని.. తన అభిప్రాయాన్ని తన దగ్గరే ఉంచుకుంటానని ముక్తాయించారు. మామ ఎంట్రీ ఏమో కానీ అల్లుడు మాత్రం తెగ సిరాక పడిపోతున్నారని చెప్పకతప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/