వ‌రుస పాన్ ఇండియా చిత్రాల‌తో ధ‌నుష్ క‌ల్లోలం

Update: 2021-07-28 07:36 GMT
ధనుష్ త్వరలో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో త్రిభాషా చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. ధనుష్-శేఖర్ కమ్ముల చిత్రం తమిళం- తెలుగు- హిందీ భాషలలో అత్యంత భారీగా నిర్మించనున్నారు. SVCLLP బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. నేడు (28 జూలై) పుట్టిన‌రోజు జరుపుకుంటున్న జాతీయ ఉత్త‌మ‌న‌టుడు ధ‌నుష్ కి శుభాకాంక్ష‌లు చెబుతూ స‌ద‌రు బ్యాన‌ర్ ఓ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది.

ఈ సినిమాతో పాటు వ‌రుస‌గా ప‌లు చిత్రాల్లో న‌టించేందుకు ధ‌నుష్ సంత‌కాలు చేస్తుండడం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు క‌మ్ముల‌తో ఇప్పటికే ప్రకటించిన చిత్రానికి ముందే తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తార‌ని స‌మాచారం. ఇంకా ప్రకటించని ఈ మూవీ షూటింగ్ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం ఎడ్యుకేషన్ మాఫియా చుట్టూ తిరిగే సోషియో పొలిటిక‌ల్ డ్రామా.. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక యువకుడు చేసిన పోరాటాన్ని హైలైట్ గా తెర‌పై చూపిస్తారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించే వీలుంది.

ధనుష్ ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో `డి 43` షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా టీమ్ తాజాగా ధ‌నుష్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. ఇప్పటికే తన బాలీవుడ్ చిత్రం `అట్రాంగి రే` హాలీవుడ్ చిత్రం `ది గ్రే మ్యాన్` షూటింగ్ ల‌ను ధ‌నుష్ పూర్తి చేసాడు.

మిత్రన్ జవహర్ ద‌ర్శ‌కుడిగా స‌న్ పిక్చ‌ర్స్ బ్యానర్ లోనూ ధ‌నుష్ ఓ సినిమా చేస్తున్నారు. అలాగే అన్న‌య్య‌ సెల్వరాఘవన్ తో కలిసి `నాన్ వరువెన్` కోసం ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు 20 న ప్రారంభం కానుంది. అలాగే సెల్వ రాఘ‌వ‌న్ తో బ్యాక్ టు బ్యాక్ ప‌ని చేస్తాడు. వచ్చే ఏడాది `ఐరథిల్ ఓరువన్ 2` కోసం ఆయన తన సోదరుడు దర్శకుడు సెల్వరాఘవన్ తో ప‌ని చేస్తారు. బ్యాక్ టు బ్యాక్ సంత‌కాలు చేసినవి పూర్తి చేసేందుకు మ‌రో మూడేళ్లు ప‌ట్ట‌నుంది. వీట‌న్నిటి కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఉన్నారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అల్లుడు అని పిల‌వాల్సిన ప‌ని లేకుండా ధ‌నుష్ మామ‌గారు ర‌జ‌నీ కాంత్ అని పిలిచే రేంజుకు ఎదిగిన ధ‌నుష్ వ‌య‌సు 38. ఆయ‌న‌కు తుపాకి త‌ర‌పున‌ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు.
Tags:    

Similar News