బాలీవుడ్ డ్రీమ్‌గాళ్ హేమమాలిని నిన్నటిరోజున జైపూర్ రోడ్‌లో ఘోరమైన యాక్సిడెంట్‌కి గురై గాయాల పాలైన సంగతి తెలిసిందే. ముఖం, కను రెప్పలపై, మెడపై తీవ్రంగా గాయాలై ఒళ్లంతా రక్తసిక్తమైంది. అయితే ఆ ఫోటోల్ని మీడియా యథాతథంగా ప్రచురించి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసింది.
ఇదే విషయంపై హేమమాలిని భర్త ధర్మేంద్ర సీరియస్ అవుతూ మీడియా టీఆర్‌పీ గేమ్‌ని తూర్పారబట్టాడు. అలాంటి ఫోటోల్ని యథాతథంగా ప్రచురించి అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం తగదని హితభోధ చేశారు. వాస్తవానికి మధురై నుంచి హేమ ఒంటరిగా కార్‌లో జైపూర్ బయల్దేరారు. మార్గం మధ్యలో యాక్సిడెంట్‌కి గురయ్యాక ధర్మేంద్రకు ఫోన్ కాల్ వెళ్లింది. అప్పటికే తను నటించిన 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' ప్రీమియర్ కోసం థియేటర్‌కి వెళ్లిన ధర్మేంద్రకు ఈ న్యూస్ షాకిచ్చింది. నెట్‌లో ఫోటోలు చూసి షాక్‌కి గురయ్యానని అన్నారాయన. తీవ్రంగా కలతకు గురయ్యానని చెప్పారు. ఇదే విషయాన్ని మీడియా ముందుంచి, నిజానికి ఆ ఫోటోల్ని అలా చూపించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మీడియా ఇలా చేయడం వల్ల బోలెడంత నష్టం కలుగుతుందని విమర్శించారు.
ఇకపోతే సదరు బాలికను కోల్పోయిన ఫ్యామిలీ వారు తమ బిడ్డను కూడా హేమమాలినితో పాటు కారులో తీసుకెళ్ళి ఉంటే ఆమె బతికిఉండేదని చెబుతున్నారు. ఆ విషయంపై మాట్లాడండి ధర్మేంద్ర సార్. ఫోటోలకే అంత భయపడితే, మరి ప్రాణం కోల్పోయిన కుటుంబం పరిస్థితేంటి?