ఫస్ట్ లుక్: సీరియస్ 'ధృవ' భలే ఉన్నాడు

Update: 2016-08-15 09:53 GMT
ఇప్పటికే తన ప్రీ-లుక్ తో అదరగొట్టేసిన రామ్‌ చరణ్‌.. ఇప్పుడు స్వాతాంత్ర్యదినోత్సవ సందర్భంగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో మెగా అభిమానులకు ఆనందం పంచుతున్నాడు. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమా మొదటి చూపులను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేశారు.

చెప్పేది ఒక పోలీస్ ఆఫీసర్ కథ కాబట్టి.. చాలా ఇంటెన్స్ గా ఆ పాత్రలను చూపించాలని ఫిక్సయినట్లున్నారు. అందుకే చరణ్‌ నడిచొస్తున్న స్టిల్స్ చాలా యాక్షన్ ఫీల్ తో అదిరిపోయాయ్. క్లోజప్ పోస్టర్ అయినా.. వాకింగ్ స్టిల్ అయినా.. డిఫరెంట్ ఫేషియల్ లుక్.. కొత్తగా ఉన్న ఆ మీసం.. అలాగే డిఫరెంట్ నడక.. అదరగొట్టశాయి. ఈ పోస్టర్లతో మెగా ఫ్యాన్లకు నిజంగానే పండగే. సీరియస్ లుక్కులో రామ్ చరణ్‌ భలేగా ఉన్నాడు. అయితే టైటిల్ డిజైన్ వెనుక '8' అనే అక్షరం ఎందుకు పెట్టారు? దానికి ధృవకు సంబంధం ఏంటి? అక్టోబర్ 8న సినిమా వస్తోందా? లేకపోతే ఇంకేమైనా ట్విస్టు ఉందా? మొదలగు విషయాలు తెలియాల్సి ఉంది.

సురేందర్ రెడ్డి డైరక్షన్లో తమిళ హిట్ 'థని ఒరువన్' రీమేక్ గా రూపొందుతున్న ఈ 'ధృవ'లో చరణ్‌ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా నటిస్తున్నాడని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ వారు చరణ్‌ తో రూపొందిస్తున్న రెండో సినిమా ఇది. దసరా కానుకగా విడుదలవ్వనుంది.
Tags:    

Similar News