ధృవ వాయిదా.. రెండు రోజుల్లో చెప్తాం

Update: 2016-11-16 05:27 GMT
సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ వాయిదా వేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దేశం ఎదుర్కొంటున్న కరెన్సీ కొరత కష్టాలు.. ఫిలిం ఇండస్ట్రీపై గట్టి దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన సినిమాలు వసూళ్లు లేక వెలవెలబోతుంటే.. విడుదల కావాల్సిన సినిమాలు వాయిదాలు వేసేసుకుంటున్నాయి.

అయితే.. చెర్రీ మూవీ ధృవను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ముందు నుంచీ షెడ్యూల్ చేశారు. డిసెంబర్ 2న విడుదల అన్నారు కానీ.. ఆ విషయంపై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ లేదు. ఇప్పుడు కరెన్సీ ఎఫెక్ట్ తో.. ఏకంగా ఫిబ్రవరికి వాయిదా వేసేశారనే న్యూస్ చక్కర్లు కొడుతుండడంతో.. ధృవ టీం నుంచి స్టేట్మెంట్ వచ్చేసింది. 'ఫిబ్రవరిలో ధృవ రిలీజ్ అనే రూమర్స్ ను నమ్మద్దు. ధృవ డిసెంబర్ లోనే విడుదల కావడం ఖాయం. ప్రీ రిలీజ్ ఫంక్షన్.. రిలీజ్ పై ఫైనల్ డేట్స్ ను ఇవాళో రేపో ప్రకటించేస్తాం' అని ఫ్యాన్స్ అసోసియేషన్లకు ప్రకటించింది ధృవ యూనిట్.

ధృవ టీం నుంచి వచ్చిన ఈ స్టేట్మెంట్ తో.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. నవంబర్ పూర్తి అయ్యేందుకు ఇంకా రెండు వారాలు సమయం ఉండడం.. అక్కడి నుంచ మరో వారం సమయం తీసుకున్నా.. ఈ కరెన్సీ కొరత తగ్గే అవకాశం ఉండడంతో.. డిసెంబర్ రిలీజ్ విషయంలో ధృవ తగ్గడం లేదని తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News