‘అపరిచితుడు’ తర్వాత సరైన సక్సెస్ లేక అల్లాడుతున్నాడు విక్రమ్. నిఖార్సయిన హిట్టు కోసం దశాబ్దం నుంచి అతడి పోరాటం సాగుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఐ’ తీవ్ర నిరాశకు గురి చేయగా.. మిగతా సినిమాలు కూడా అంచనాల్ని అందుకోలేకపోయాయి. గత ఏడాది వచ్చిన ‘ఇంకొక్కడు’ విక్రమ్ ఫ్లాపుల పరంపరంలో ఇంకొక్కటిగా నిలిచింది. ఇప్పుడు ‘చియాన్’ ఆశలన్నీ ‘ధృవ నక్షత్రం’ మీదే ఉన్నాయి. విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ ఇది. సినిమా మొదలైన కొన్ని రోజులకే ఆ మధ్య ఒక టీజర్ రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచాడు గౌతమ్. తాజాగా విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా మరో టీజర్ వదిలాడతను.
మొదటి టీజర్లో ఒక టెర్రరిస్ట్ నాయకుడికి.. సీక్రెట్ ఏజెంట్ అయిన విక్రమ్ కు మధ్య సాగే సంభాషణ ఉంటుంది. హీరో సహచరుడిని బందీగా తీసుకున్న విలన్.. హీరోను తన దగ్గరికి రమ్మని బెదిరిస్తుంటాడు. ఆ టీజర్ నేపథ్యమంతా ఫారిన్లో ఉంటుంది. విలన్ని అమీతుమీ తేల్చుకోవడానికి హీరో ఫారిన్ నుంచి బయల్దేరబోతున్నట్లు చూపిస్తారు టీజర్లో. ఆ టీజర్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి రెండో టీజర్ మొదలైంది. హీరో ఢిల్లీలో అడుగుపెట్టే క్రమంలో విలన్ తో సాగించే సంభాషణను ఇందులో చూపించారు. తొలి టీజర్లో మాదిరే స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు విక్రమ్. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ వావ్ అనిపిస్తుంది. టీజర్లో అడుగడుగునా గౌతమ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. గౌతమ్ ఆస్థాన సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తుండగా.. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రీతూ వర్మతో పాటు మరో తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/