నందమూరి నటసింహం బాలకృష్ణ డిక్టేటర్ అవతారం ఎత్తి కొడితే ఎలా ఉంటుంది ? ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు డిక్టేటర్ బాలకృష్ణ. అది కూడా మాటల్లో కాకుండా.. తన స్టైల్ లో జస్ట్ ఒకే ఒక్క ఫోటోతో తేల్చేశాడు. హ్యాపీ న్యూ ఇయర్ పోస్టర్ లో డిక్టేటర్ స్టైల్ ఏంటో చెప్పేశాడు.
చేతిలో ఓ పెద్ద బోల్ట్ ని పట్టుకుని, ఇరగదీసేసిన మహా మాస్ లుక్ తో బాలయ్య నుంచున పోస్టర్స్ అదుర్స్ అని చెప్పాలి. కిందపడి గిలగిలకొట్టుకుంటున్న రౌడీలను చూస్తే.. బాలకృష్ణ ఉగ్రరూపం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పచ్చు. అసలు ఈ మధ్య కాలంలో ఇంత మాస్ లుక్ తో వచ్చిన పోస్టర్ కనిపించలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒకే పోస్టర్ లో పది రకాల ఫీలింగ్స్ తెచ్చేందుకు ప్రయత్నించకుండా.. కేవలం తమ టార్గెట్ ఏంటో, మూవీ ఎలా ఉంటుందో ఒక్క మాస్ ఫోటోతోనే డైరెక్టర్ చెప్పేయడం విశేషం. శ్రీవాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంపై.. నందమూరి ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. లయన్ ఫ్లాప్ తర్వాత వస్తున్న చిత్రం కావడం, బాలయ్య నటిస్తున్న 99 మూవీ కావడంతో.. ఈ మూవీ సూపర్ హిట్ కావాలని నటసింహం ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సంక్రాంతి పండక్కి వచ్చి ఎన్నో సూపర్ హిట్స్ కొట్టిన బాలకృష్ణకు.. ఆ సెంటిమెంట్ కూడా కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక డిక్టేటర్ లో అందాల విందు కూడా ఎక్కువగానే ఉండనుంది. అంజలి, సోనాల్ చౌహాన్, అక్షలతో పాటు.. ఇప్పటికే ముమైత్ ఖాన్ తో ఓ ఐటెం సాంగ్ కూడా పిక్చరైజ్ చేశారు. జనవరి 14న డిక్టేటర్ రిలీజ్ డేట్.