నటసింహా బాలయ్య డిక్టేటర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ లు - పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా సినిమాని పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించేశారు.
అయితే బ్యాలెన్స్ చిత్రీకరణ ఈనెల 23 నుంచి డిల్లీ లో మొదలవుతుంది. వారం పాటు కంటిన్యువస్ గా చిత్రీకరించి టాకీ పార్ట్ ను పూర్తి చేస్తారు. దీంతో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది కాబట్టి డిల్లీ లోనే గుమ్మడికాయ కార్యక్రమం చేస్తారన్నమాట. శ్రీవాస్ ఈసారి బాలయ్యను సరికొత్త అవతారంలో చూపిస్తున్నారు. బాలయ్య రేంజును పీక్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టైటిల్ కి తగ్గట్టే డిక్టేటర్ పోస్టర్ లలో బాలయ్య విల్ పవర్ కనిపించింది. పోస్టర్లకు అభిమానుల్లో చక్కని స్పందన వచ్చింది.
ఈ సినిమాలో యాక్షన్ ని సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ పబ్ లో డిక్టేటర్ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. దిల్లీలో షెడ్యూల్ పూర్తవ్వగానే ఆ తర్వాత డిసెంబర్ చివరి వారంలో పాటల్ని రిలీజ్ చేసి ప్రమోషన్ లో స్పీడ్ పెంచుతారు. సంక్రాంతి బరిలో పందెం కోడిలా బాలయ్య దూసుకొస్తారన్నమాట!