బాలయ్య అరుదైన వందో సినిమా రికార్డును చేరుకోనున్నారు. ప్రస్తుతం 99వ సినిమాగా తెరకెక్కనున్న డిక్టేటర్ సినిమా రేపటినుండి చిత్రీకరణ మొదలుకానుంది. లౌక్యం సినిమాతో కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ కొట్టిన శ్రీవాస్ తొలిసారి సీనియర్ హీరో బాలయ్య తో జతకట్టారు. ఇప్పటికే కళా దర్శకుడు బ్రహ్మ కడలి ఆధ్వర్యం లో రామానాయుడు స్టూడియో లో సెట్స్ సిద్ధం చేశారుట. తొలి షెడ్యూల్ ఇక్కడే పూర్తి చేసి రెండో షెడ్యూల్ కోసం చిత్ర బృందం యూరప్ వెళ్లనుంది. అక్కడ బాలయ్య పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు, కొంత టాకీ చిత్రీకరిస్తారు. బాలయ్య సరసన హీరోయిన్లుగా నటిస్తున్న అంజలి, సోనాల్ చౌహన్ లపై పాటలను కూడా ఇదే షెడ్యూల్ లో షూట్ చేయనున్నారు.
ఈ సినిమాకి బోలెడన్ని ప్రత్యేకతలున్నాయి. జంట రచయితలైన గోపి మోహన్, కోన వెంకట్ తొలిసారి బాలయ్య సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. వీరికి శ్రీధర్ సీపాన, డైమండ్ రత్నం లాంటి మరో ఇద్దరు రచయితలు జతకలిశారు. ఇదే సినిమాతో ఈరోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్షిణాదిలో పూర్తి స్థాయి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇలా ఈ సినిమాకి ప్రతీది ప్రత్యేకమే. అన్నిటికీ మించి 100వ సినిమా ఎలా వుండబోతుందో ఈ సినిమా ద్వారా ఓ హింట్ ఇవ్వనున్నారని వినికిడి.