క్రాక్ వివాదంపై కౌన్సిల్ లో పంచాయితీ.. చివ‌రికేం తేల్చారు?

Update: 2021-01-21 14:51 GMT
సంక్రాంతి బ‌రిలో రిలీజై బాగా ఆడుతున్నా.. క్రాక్ సినిమాని నైజాంలోని కొన్ని థియేట‌ర్ల నుంచి తొల‌గించార‌ని గత కొద్దిరోజులుగా వ‌రంగల్ శ్రీ‌ను అనే పంపిణీదారుడు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు- శిరీష్ త‌మ సినిమాలను రిలీజ్ చేసుకునేందుకు క్రాక్ కి అన్యాయం చేశార‌న్న‌ది ఆయ‌న ప్ర‌ధాన‌ ఆరోప‌ణ‌.

అయితే ఈ వివాదం చాంబ‌ర్ .. నిర్మాత‌ల మండ‌లి వ‌ర‌కూ వెళ్లింది. క్రాక్ కు ఈ శుక్ర‌వారం నుంచి థియేట‌ర్లు ఇవ్వాల‌న్న డిమాండ్ ని వినిపిస్తూ వ‌రంగల్ శ్రీ‌నుతో పాటు నిర్మాత ఠాగూర్ మ‌ధు బ‌రిలో దిగార‌ని తెలిసింది. తెర‌వెన‌క అస‌లేం జ‌రిగిందో ఆ ఇద్ద‌రూ చాంబర్ పెద్ద‌ల‌కు నిర్మాత‌ల మండ‌లికి ఫిర్యాదు చేశార‌ని స‌మాచారం.

క్రాక్ కి జ‌రిగిన అన్యాయంపై ప్ర‌తిదీ పూస గుచ్చిన‌ట్టు ఒక లేఖ రాసి వ‌రంగ‌ల్ శ్రీ‌ను కౌన్సిల్ కి అందించ‌డంతో వెంట‌నే అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసి దీనిపై చ‌ర్చించార‌ట‌. ఇక ఈ కుంభ‌కోణంలో స్టాక్ శ్రీ‌ధ‌ర్ అనే వ్య‌క్తి థియేట‌ర్ల య‌జ‌మానులు బెదిరిస్తున్నార‌ని మ‌రో కొత్త పాయింట్ లేవ‌నెత్త‌డం తో దానిపైనా స‌మావేశంలో చ‌ర్చించార‌ని స‌మాచారం. క్రాక్ కి  అన్యాయం జ‌రిగిన‌ట్టే ఇక‌పై ఎవ‌రికీ జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. త‌న‌కు దిల్ రాజు-శిరీష్ బృందం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని వ‌రంగ‌ల్ శ్రీ‌ను కౌన్సిల్ ని కోరార‌ట‌.
Tags:    

Similar News